బిగ్‌‌బాస్‌ -4 హోస్ట్‌గా మన్మథుడు?

బిగ్‌‌బాస్‌ -4 హోస్ట్‌గా మన్మథుడు?

తెలుగు బుల్లితెరపై సక్సెస్‌‌ఫుల్‌ రియాలిటీ షో ‘బిగ్‌ బాస్‌ ’. ‘స్టార్‌ మా’ చానెల్‌‌లో ప్రసారమయ్యే ఈ షో ఇప్పటికే మూడు సీజన్స్‌‌ పూర్తి చేసుకుంది. మొదటి సీజన్‌‌కు ఎన్టీఆర్‌, రెండో సీజన్‌‌కు నాని హోస్ట్‌‌ చేయగా మూడో సీజన్‌‌కు అక్కినేని నాగార్జున హోస్ట్‌‌గా చేశాడు. మూడు సీజన్లూ హిట్టయ్యా యి. అయితే నాగార్జున హోస్ట్‌‌ చేసిన మూడో సీజన్‌‌ అన్నింటికంటే పెద్ద హిట్‌‌గా నిలిచి, టీఆర్‌పీ రేటింగ్స్‌‌లో సత్తా చాటింది. ఈ సీజన్‌‌ అయిపోయి ఇప్పటికే నాలుగు నెలలు పూర్తైంది. దీంతో ‘స్టార్‌ మా’ టీమ్‌ నాలుగో ‘బిగ్‌ బాస్‌ ’ షో కోసం ఆలోచన చేస్తోంది. కంటెస్టెంట్స్‌‌ కంటే ముందుగా షోలో ప్రధాన అట్రాక్షన్‌‌ హోస్ట్‌‌. ‘బిగ్‌ బాస్‌ ’ను హోస్ట్‌‌ చేసే స్టార్‌‌ను బట్టి కూడా దీని సక్సెస్‌ రేటు ఆధారపడి ఉంటుంది. అందుకే హిందీలో ‘సూపర్‌ స్టార్‌ ’ సల్మాన్‌‌ ఖాన్‌‌, తమిళంలో కమల్ హసన్‌‌ హోస్ట్‌‌ చేస్తున్నారు. తెలుగుకు సంబంధించి కొత్త సీజన్‌‌కు ఎవరిని హోస్ట్‌‌గా తీసుకోవాలా అని నిర్వాహకులు ఆలోచిస్తున్నారు. మూడు సీజన్స్‌‌లోకి మంచి సక్సెస్‌ రేట్‌ అందించిన నాగార్జుననే నాలుగో సీజన్‌‌కు తీసుకోవాలనుకుంటున్నట్లు సమాచారం. పైగా ఎన్టీఆర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌ ’తో బిజీగా ఉంటే, నాని కూడా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. దీంతో గత సీజన్‌‌ను హిట్‌ చేసిన నాగార్జున అయితేనే బెస్ట్‌‌ అని ‘బిగ్‌ బాస్‌ ’ ప్రొడ్యూసర్స్‌‌ అనుకుంటున్నారు. ఈ విషయంపై ప్రస్తుతం ఆయనతో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. నాగార్జున కూడా ‘బిగ్‌ బాస్‌ ’పై ఆసక్తిగానే ఉన్నారు. అయితే ‘బిగ్‌ బాస్‌ –4’ సీజన్‌‌ ఎప్పుడు ప్రారంభమవుతుందో స్పష్టమైన సమాచారం లేదు.

For More News..

వీడియో: కరోనాపై వరల్డ్స్ షార్టెస్ట్ హార్రర్ ఫిల్మ్

కరోనా దెబ్బకు 5 వేల మంది ఉద్యోగాలు ఊస్ట్

బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఐపీఎల్‌‌‌‌ ప్రైజ్‌‌‌‌మనీ సగానికి తగ్గింపు