బంజరాహిల్స్ కొత్త సీఐగా నాగేశ్వర్ రావు

బంజరాహిల్స్ కొత్త సీఐగా నాగేశ్వర్ రావు

హైదరాబాద్: బంజారాహిల్స్ పీఎస్ కు కొత్త సీఐగా నాగేశ్వర్ రావును ప్రభుత్వం నియమించింది. రాడిసన్ బ్లూ పబ్ డ్రగ్స్ వ్యవహారాన్ని ఇన్ స్పెక్టర్  నాగేశ్వర్ రావు టీమ్ బట్టబయలు చేసింది. ఇప్పుడు ఆయననే బంజరాహిల్స్ సీఐగా పంపుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నాగేశ్వరరావు పై గతంలో ఎన్నో సంచలన కేసులు ఛేదించిన రికార్డ్ ఉంది. 

బంజారాహిల్స్ పోలీసులు శనివారం రాత్రి ర్యాడిసన్ బ్లూ హోటల్ పై దాడి చేశారు. పబ్ ను సమయానికి మించి నడుపుతున్నట్లు గుర్తించిన పోలీసులు.. మొత్తం 142 మందిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ కేసులో ప్రముఖులు, సినీ నటులను వదిలిపెట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో పోలీసు ఉన్నతాధికారులు సత్వర చర్యలు చేపట్టారు. సినీ నటి నిహారికను పీఎస్ కు తీసురాకుండా బయటకు పంపిచారనే కారణంతో  బంజారాహిల్స్ సీఐ శివచంద్రపై సస్పెన్షన్ వేటు పడింది. వెంటనే నిహారికను పీఎస్ కు తీసుకువచ్చి విచారించారు. అనంతరం ఆమెకు నోటీసులు ఇచ్చి పంపించారు. ఏసీపీ సుదర్శన్ కు ఛార్జ్ మెమో దాఖలు చేశారు.

మరిన్ని వార్తల కోసం..

రాములోరి కల్యాణానికి ముస్తాబైన భద్రాద్రి

నిహారిక, రాహుల్ సిప్లిగంజ్కు నోటీసులు