నిహారిక, రాహుల్ సిప్లిగంజ్కు నోటీసులు

నిహారిక, రాహుల్ సిప్లిగంజ్కు నోటీసులు

బంజారాహిల్స్ పబ్ కేసు కీలక మలుపు తిరిగింది. ప్రముఖులు, సినీ నటులను వదిలిపెట్టడంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. సినీ నటి నిహారికను పీఎస్ కు తీసురాకుండా బయటకు పంపించడంతో బంజారాహిల్స్ సీఐ శివచంద్రపై సస్పెన్షన్ వేటు పడింది. వెంటనే నిహారికను పీఎస్ కు తీసుకువచ్చి విచారించారు. అనంతరం ఆమెకు నోటీసులు ఇచ్చి పంపించారు. అలాగే పోలీసుల అదుపులో  ఉన్న రాహుల్ సిప్లిగంజ్ ను విచారించి నోటీసులు ఇచ్చి పంపించారు. 

ఈ కేసులో ఏసీపీ సుదర్శన్ కు ఛార్జ్ మెమో దాఖలు చేశారు. కేసులో ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో ఈవెంట్ ఆర్గనైజర్స్, పబ్ నిర్వాహకులు ఉన్నారు. డ్రగ్స్ ఎక్కడ నుంచి తెచ్చారనే కోణంలో విచారిస్తున్నారు ఉన్నతాధికారులు. VIP లను ఎవరు కో ఆర్డినేట్ చేశారనే కోణంలో ఆధారాలు సేకరిస్తున్నారు. పక్కా సమాచారంతో పబ్ పై పోలీసులు దాడి చేసినట్టు తెలుస్తోంది. 

మరిన్ని వార్తల కోసం

రాములోరి కల్యాణానికి ముస్తాబైన భద్రాద్రి

పోలీసుల అదుపులో రాహుల్ సిప్లిగంజ్