పోలీసుల అదుపులో రాహుల్ సిప్లిగంజ్

పోలీసుల అదుపులో రాహుల్ సిప్లిగంజ్

బంజారాహిల్స్ పోలీసులు శనివారం రాత్రి ర్యాడిసన్ బ్లూ హోటల్ పై దాడి చేశారు. ఈ దాడులలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హోటల్ లో ఉన్న ఫుడింగ్ మింగ్ పబ్ ను సమయానికి మించి నడుపుతున్నట్లు గుర్తించిన పోలీసులు.. రాత్రి 3 గంటల సమయంలో దాడులు చేసి యజమానులతో సహా సుమారు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ బంజారాహిల్స్ పీఎస్ కు తరలించారు. అయితే పోలీసులు తీసుకొచ్చిన యువకులు పోలీసు స్టేషన్ లో హంగామా సృష్టించారు. తమను ఎందుకు తీసుకొచ్చారంటూ ఆందోళన చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అందరినీ విచారించి, నోటీసులిచ్చి ఇచ్చి పంపిస్తున్నట్లు తెలుస్తోంది. పబ్ లో పోలీసులు డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు అంతర్గత సమాచారం.

కాగా.. బంజారాహిల్స్ పీఎస్ నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెల్లుతున్నాయి. పోలీస్ స్టేషన్‎కు కూతవేటు దూరంలో ఉన్న ర్యాడిసన్ పబ్ మీద స్థానికులు గతంలోనే ఫిర్యాదు చేశారు. పబ్ మాజీ ఎంపీ కూతురుది కావడంతో పోలీసులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. రాత్రి మూడు గంటల వరకు పబ్ నడిచినా.. ఆ వైపు కనీసం కన్నెత్తి కూడా చూడరని బంజారాహిల్స్ పోలీసులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

For More News..

సర్కారువారి పాట నుంచి మరో అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్