కోల్బెల్ట్ ప్రాంతంలో ప్రతిభా వంతులకు పురస్కారాలు

కోల్బెల్ట్  ప్రాంతంలో ప్రతిభా వంతులకు పురస్కారాలు

గోదావరిఖని, వెలుగు:  సింగరేణి కోల్​బెల్ట్ ప్రాంతంలో సంస్థకు చెందిన  కవులు, కళాకారులు, రచయితలు, క్రీడాకారులు, జర్నలిస్ట్​లు, డాక్టర్లు, అడ్వకేట్లు  తదితర రంగాల్లో ప్రతిభావంతులను గుర్తించి హైదరాబాద్ తారా ఆర్ట్స్ అకాడెమీ శనివారం రాత్రి, ఆదివారం రెండు రోజుల పాటు నల్లవజ్రం కీర్తి పురస్కారం, ఉగాది పురస్కారాలను అందజేసింది. 

గోదావరిఖని మార్కండేయకాలనీలోని ఓ ఫంక్షన్ ​హాల్​లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రామగుండం ఆర్మ్​డ్​ రిజర్వ్​ (ఏఆర్​) ఏసీపీ ప్రతాప్​, సినీ సంగీత దర్శకులు, గాయకుడు ఘంటాడి కృష్ణ, రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సారధి సలహామండలి సభ్యులు అంతడుపుల నాగరాజు, డ్యాన్సర్​ వర్షిణీ, తారా ఆర్ట్స్​ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు సంకె రాజేశ్​, తదితరులు హాజరై పురస్కారాలను అందజేశారు.