
భారీ వర్షాలు హైదరాబాద్ మహానగరాన్ని కొన్ని రోజులుగా అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు,వరదలతో హైదరాబాద్‌లోని కాలనీల వాసులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు భారీ విరాళం ప్రకటించి తన గొప్ప మనసును చాటుకున్నారు సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ. వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు తన వంతు సాయంగా రూ. కోటి 50 లక్షలను విరాళంగా ప్రకటించారు. దాంతో పాటు పాతబస్తీలో బసవతారక రామా సేవసమితి ఆధ్వర్యంలో 1000 కుటుంబాలకు బిర్యానీ ప్యాకెట్స్ అందేలా ఏర్పాట్లు చేసినట్లుగా సమాచారం.