మంత్రి బడ్జెట్ చదువుతుంటే నిద్రలోకెళ్ళిన చీఫ్ విప్ : లోకేష్

మంత్రి బడ్జెట్ చదువుతుంటే నిద్రలోకెళ్ళిన చీఫ్ విప్ : లోకేష్

మాజీ మంత్రి నారా లోకేశ్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై సెటైర్లు వేశాడు. ఈ రోజు ఏపీ అసెంబ్లీలో జరిగిన బడ్జెట్ పై, నాయకులపై సోషల్ మీడియా వేదికగా ట్విటర్ లో విసుర్లు విసిరాడు. బడ్జెట్ పై వైసీపీ ప్రభుత్వం కోసిన కోతలకు,  కేటాయించిన నిధులకు పొంతనే లేదని ఆయన అన్నారు. ఆ విషయం పక్కనే ఉన్న గౌరవ వైసీపీ సభ్యులకు ముందే తెలిసినట్టుందని, అందుకే ఆ పార్టీ నేతలే గుర్రుపెట్టి నిద్రపోతున్నారని ఎద్దేవా చేశారు. బడ్జెట్ వింటున్న సొంత నేతలే నిద్రపోతుంటే.. ఇక సీఎం గారి హామీలన్నీ గుర్తుంచుకొని,  బడ్జెట్ విన్న ప్రజల పరిస్థితి ఏంటో? అని లోకేశ్ ప్రశ్నించాడు.

ఈ రోజు అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సమయంలో.. వైసీపీ నేత, ఏపీ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పక్కన ఉండి ఆవలిస్తున్నారు. ఈ దృశ్యాలపై లోకేశ్ ట్విటర్ లో సెటైర్లు వేశారు.