- ఎంప్లాయీస్యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహరావు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణి యాజమాన్యం రాని లాభాలు చూపించి కార్మికులను మోసం చేసిందని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మందా నర్సింహారావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి, లాభాలు, ఆదాయ వ్యయాలపై సమగ్ర విచారణ చేపట్టాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి లేఖ రాశామని తెలిపారు.
గత ఆర్థిక సంవత్సరంలో ఆరు మిలియన్‌టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసినట్టుగాయాజమాన్యం తప్పుడు రిపోర్టులను చూపిందని ఆరోపించారు. ఈ తప్పుడు రిపోర్టుల మూలంగా సెస్, డీఎంఎఫ్టీ, సీఎస్ఆర్, ఇతరత్రా ట్యాక్సుల రూపంలో సింగరేణి పెద్ద మొత్తంలో ఆర్థికంగా నష్టపోయిందన్నారు. రాని లాభాలు చూపించి సింగరేణి సంస్థను నష్టాలకు గురిచేసిన ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు.
