లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ట్రాఫిక్ కానిస్టేబుల్

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ట్రాఫిక్ కానిస్టేబుల్

హైదరాబాద్: ఓ పక్క చలాన్లు కట్టలేక వేలకు వేలల్లో చలాన్లు పెండింగ్ పెడుతున్న వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం రాయితీలు ఇచ్చి ఊరట కలిగిస్తుంటే మరో వైపు ట్రాఫిక్ కానిస్టేబుల్ చేతివాటం చూపుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ బైక్ ను అప్పజెప్పేందుకు లంచం అడిగాడు ట్రాఫిక్ కానిస్టేబుల్. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికాడు. వివరాల్లోకి వెళితే.. 

నారాయణ గూడ ట్రాఫిక్ కానిస్టేబుల్ వికాస్ కుమార్ యాదవ్.. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ బైక్ ను అప్పజెప్పేందుకు వాహనదారుని నుంచి రూ.5 వేలు లంచం అడిగాడు. బాధిడితుని నుంచి లంచం తీసుకుంటుండగా ట్రాఫిక్ కానిస్టేబుల్ వికాస్ కుమార్ యాదవ్ ను ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.