పైలెట్ల అలర్ట్​..తప్పిన ప్రమాదం

పైలెట్ల అలర్ట్​..తప్పిన ప్రమాదం

కొలంబో: ఆకాశంలో పెద్ద విమాన ప్రమాదం తప్పింది. ఎయిర్​ ట్రాఫిక్​ కంట్రోల్(ఏటీసీ)​ గైడెన్స్​ ప్రకారం వెళ్తే భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగేది. శ్రీలంక​ ఎయిర్​లైన్స్​ అధికారుల వివరాల ప్రకారం.. శ్రీలంకన్​ ఎయిర్ ​లైన్స్ ఫ్లైట్​ లండన్​ నుంచి కొలంబో పోతోంది. 33వేల అడుగుల ఎత్తులో 275 మంది ప్రయాణికులతో యూ 504 ఫ్లైట్​ ప్రయాణిస్తోంది. టర్కీ ఎయిర్​స్పేస్​లోకి ఎంటర్​అయ్యాక 35వేల అడుగుల ఎత్తులో ప్రయాణించాలని అంకారా  ఏటీసీ నుంచి ఆదేశాలు అందాయి. అయితే 35వేల అడుగుల ఎత్తులో బ్రిటిష్​ ఎయిర్​లైన్స్​ విమానం ప్రయాణిస్తోందని, 15 మైళ్ల దూరంలోనే ఉందని అంకారా ట్రాఫిక్​ కంట్రోల్​కు సమాచారం ఇచ్చారు. ఇది పట్టించుకోని అధికారులు.. 35వేల అడుగుల ఎత్తులోనే ప్రయాణించాలని మళ్లీ రెండు సార్లు ఆదేశించారు. అయినా లంకన్​ ఎయిర్​లైన్స్​పైలెట్లు తమ విమానాన్ని 33వేల అడుగుల ఎత్తులోనే ముందుకు నడిపించారు. చివరికి తప్పును తెలుసుకున్న అంకారా ఏటీసీ అధికారులు, తమ ఆదేశాలను వెనక్కి తీసుకున్నారు.