ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో శిధిలావస్థకు చేరిన ఇళ్లల్లో ప్రజలు ఉండొద్దని నార్సింగి మున్సిపల్‌ కమిషనర్ సత్యబాబు తెలిపారు. రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపల్‌ పరిధిలో శిధిలావస్థకు చేరిన ఇళ్లను సిబ్బంది కూల్చి వేశారు. బస్తీల్లోని పురాతన, పాత ఇళ్లను గుర్తించి వాటిని తొలగించే ప్రక్రియను మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే శిధిలావస్థలో ఉన్న పలు పురాతన ఇళ్లను అధికారులు తొలగించారు. మొత్తం ఆరు ఇళ్లను గుర్తించామని కమిషనర్ సత్యబాబు వెల్లడించారు. వాటిని కూల్చివేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే ప్రజలకు అవగాహన కల్పించామని ఆయన అన్నారు. వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. జాగ్రత్తలు పాటిస్తు సురక్షితంగా ఉండాలని  మున్సిపల్‌ కమిషనర్ సత్యబాబు సూచించారు.