పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ నసీమ్ షా ఉంటున్న ఇంటిపై షాకింగ్ సంఘటనలు చోటు చేసుకున్నాయి. నజీమ్ షా ఉంటున్న ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు చేశారు. సోమవారం (నవంబర్ 10) నసీమ్ షా ప్రధాన ద్వారం వద్ద కాల్పుల దాడి జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదృష్టవశాత్తూ, ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది. పోలీస్ రిపోర్ట్స్ ప్రకారం దుండగులు అనేక రౌండ్లు కాల్పులు జరిపిన వెంటనే పారిపోయారు. దాడి జరిగిన సమయంలో ఇంట్లో ఎవరున్నారనే విషయంపై స్పష్టత లేదు.
నసీమ్‌కు దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి ఈ సంఘటనను ధృవీకరించారు, దీనిపై దర్యాప్తు జరుగుతోంది. పాకిస్థాన్ మీడియా న్యూస్ ప్రకారం దర్యాప్తులో భాగంగా ఐదుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడి వెనుక గల ఉద్దేశ్యాన్ని అధికారులు ఇంకా గుర్తించలేదు. ఈ ఘటనతో శ్రీలంకతో మంగళవారం (నవంబర్ 11) జరగబోయే తొలి వన్డేకు ఈ పాక్ పేసర్ దూరమవుతాడని భావించినా అది జరగలేదు. ఈ దాడి తన షెడ్యూల్‌పై ఎలాంటి ప్రభావం చూపదని, అతను జట్టుతోనే కొనసాగుతాడని పాకిస్థాన్ క్రికెట్ వర్గాలు స్పష్టం చేశాయి.
ప్రస్తుతం నసీమ్ షా శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో ఆడుతున్నాడు. శ్రీలంకతో వన్డే సిరీస్ ముగిశాక, జింబాబ్వేతో కూడిన టీ20 ట్రై-సిరీస్‌లో కూడా నసీమ్ షా ఆడనున్నాడు. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత శ్రీలంక జట్టు పాకిస్తాన్‌లో తొలిసారి పర్యటించింది. మూడు మ్యాచ్ ల ఈ షెడ్యూల్ నవంబర్ 11 నుండి 15 వరకు ఉంటుంది. ఆ తర్వాత ఈ పాక్ ఫాస్ట్ బౌలర్ జింబాబ్వేతో టీ20 ఫార్మాట్ లో జరగనున్న ట్రై-సిరీస్ ఆడతాడు. గత కొంతకాలంగా ఫామ్ లో లేని నసీమ్ షా శ్రీలంకతో వన్డే సిరీస్, టీ20ఐ ట్రై-సిరీస్ లో రాణించి ఫామ్ లోకి రావాలని భావిస్తున్నాడు.
Militants opened fire at the house of the national cricket team fast bowler @iNaseemShah in Lower Dir. The firing has damaged the main gate, windows, and a vehicle partially. However, Police reached the scene immediately, but the attackers managed to escape. pic.twitter.com/jgLVfatBi4
— Jawad Yousafzai (@JawadYousufxai) November 10, 2025
