సికింద్రాబాద్​: గాంధీ ఆస్పత్రిని సందర్శించిన జాతీయ వైద్య బృందం

సికింద్రాబాద్​:  గాంధీ ఆస్పత్రిని  సందర్శించిన జాతీయ వైద్య బృందం

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్​లోని గాంధీ ఆసుపత్రిని ఆయుష్మాన్ భారత్ (అభా ఐటీ) డిజిటల్ మిషన్ వర్క్​షాపులో భాగంగా18 రాష్ట్రాలకు చెందిన నోడల్ అధికారులు శుక్రవారం సందర్శించారు. ఆసుపత్రిలో అందుతున్న డిజిటల్ వైద్య సేవలను గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి, సీఎస్ ఆర్ఎం ఓ డాక్టర్  శేషాద్రి, నోడల్ అధికారి డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి వారికి వివరించారు. రోగుల రికార్డులు డిజిటల్ చేయడం ద్వారా వారి ఆరోగ్య వివరాలు, ల్యాబ్ రిపోర్టులు జీవితాంతం అందుబాటులో ఉంటాయన్నారు. 

స్కాన్ అండ్ షేర్ విధానం ద్వారా వేగంగా ఓపీ సేవలు అందుతున్నాయన్నారు. హాస్పిటల్​లో 100 శాతం డిజిటల్ సేవలు అమలు చేసేలా ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. జాతీయ స్థాయి మెడికల్ బృంద సభ్యులు డాక్టర్ పంకజ్ అరోరా, సౌరభ్ సింగ్, రితిక, బబిత, అబ్యుదయ్  తదితరుల ఉన్నారు.