
హైదరాబాద్, వెలుగు: నేషనల్ సబ్ జూనియర్ జూడో చాంపియన్‌షిప్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. నవంబర్ 3 నుంచి 7 వరకు యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈ టోర్నీ జరుగుతుందని తెలంగాణ జూడో అసోసియేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ప్రకటించారు. ఈ టోర్నీ ఏర్పాట్లపై జూడో అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ కైలాష్ యాదవ్ అధ్యక్షతన ఆదివారం జరిగిన సమీక్షలో పాల్గొని బ్రోజర్ రిలీజ్ చేశారు.
సిటీలో జరిగే ఈ నేషనల్ ఈవెంట్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సహా పలువురు ముఖ్యులు హాజరవుతారని తెలిపారు. ఈ పోటీలకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని, దేశంలోని 29 రాష్ట్రాల జట్లు పాల్గొంటాయని పేర్కొన్నారు. నేషనల్ చాంపియన్‌షిప్‌ను విజయవంతం చేసేందుకు టోర్నీ ఆర్గనైజింగ్ కమిటీ సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. తెలంగాణ జూడో సంఘం ఆఫీస్ బేరర్లు అజిత్, రామ్ లక్ష్మణ్, శ్రీనివాసరావు, సంతోష్ కుమార్ పాల్గొన్నారు.