మార్చి 28న లోక్‌‌‌‌‌‌‌‌ అదాలత్‌‌‌‌‌‌‌‌ లో కేసులను రాజీ చేసుకోండి

మార్చి 28న లోక్‌‌‌‌‌‌‌‌ అదాలత్‌‌‌‌‌‌‌‌ లో కేసులను రాజీ చేసుకోండి

హైదరాబాద్, వెలుగు: జాతీయ లోక్‌‌‌‌‌‌‌‌ అదాలత్‌‌‌‌‌‌‌‌లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో ఈ నెల 28న లోక్‌‌‌‌‌‌‌‌ అదాలత్‌‌‌‌‌‌‌‌ నిర్వహించనున్నట్లు న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి సీహెచ్‌‌‌‌‌‌‌‌.పంచాక్షరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

సివిల్, ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌ కేసులు, కార్మిక వివాదాలు, మ్యాట్రిమోనియల్, ఎన్‌‌‌‌‌‌‌‌ఐ యాక్ట్‌‌‌‌‌‌‌‌ కింద నమోదైన కేసులను ఇరుపక్షాలు రాజీ చేసుకునేందుకు మంచి అవకాశమన్నారు. ఆసక్తి ఉన్నవాళ్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, న్యాయసేవా సదన్, మండల న్యాయసేవా కమిటీలను సంప్రదించాలని సూచించారు.