
కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి మృతి పట్ల జాతీయ, రాష్ట్ర నాయకులు తీవ్రసంతాపాన్ని వ్యక్తం చేశారు. కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న జైపాల్ రెడ్డి.. ఈనెల 20వ తేదీన గచ్చిబౌలిలోని ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ… ఈ రోజు పొద్దున కన్నుమూశారు.
జైపాల్ రెడ్డి మృతికి సంతాపం తెలిపారు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. వ్యక్తి కంటే ప్రజాస్వామ్య వ్యవస్థకు జైపాల్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇచ్చేవారని వెంకయ్య నాయుడు కొనియాడారు. జైపాల్ మృతికి సంతాపం తెలిపారు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం. జైపాల్ రెడ్డి ప్రసంగాలు అద్భుతంగా ఉండేవని ఆయన ట్వీట్ చేశారు. జైపాల్ మృతికి తెలుగు ప్రజలకు తీరని లోటన్నారు చిదంబరం. జైపాల్ రెడ్డి మరణం తనను కలిచి వేసిందని కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ట్వీట్ చేశారు.
జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యులకు రాహుల్ గాంధీ సంతాపం..
జైపాల్ రెడ్డి మృతికి సంతాపం తెలిపారు రాహుల్ గాంధీ. జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు రాహుల్ గాంధీ. జైపాల్ రెడ్డిని తెలంగాణ ముద్దు బిడ్డగా, గొప్ప పార్లమెంటేరియన్ కీర్తించారు రాహుల్ గాంధీ. తన జీవిత కాలమంతా పేద ప్రజల అభ్యున్నతి జైపాల్ రెడ్డి కృషి చేశారని రాహుల్ గాంధీ కొనియాడారు.
జైపాల్ రెడ్డి ప్రసంగాలు అద్భుతంగా ఉండేవి: చిదంబరం
జైపాల్ రెడ్డి మృతికి సంతాపం తెలిపారు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం. జైపాల్ రెడ్డి ప్రసంగాలు అద్భుతంగా ఉండేవని ఆయన ట్వీట్ చేశారు. జైపాల్ మృతికి తెలుగు ప్రజలకు తీరని లోటన్నారు చిదంబరం. జైపాల్ రెడ్డి మరణం తనను కలిచి వేసిందని కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ట్వీట్ చేశారు. జైపాల్ రెడ్డి దేశానికి ఎంతో సేవ చేశారని మాజీ ప్రధాని దేవెగౌడ అన్నారు. జైపాల్ రెడ్డి మృతికి మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ కవిత సంతాపం తెలిపారు.
దేశ రాజకీయాల్లో జైపాల్ రెడ్డి కీలక పాత్ర: కేటీఆర్
జైపాల్ రెడ్డికి మృతికి సంతాపం తెలిపారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయన కుటుంభ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశ రాజకీయాల్లో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారని చెప్పారు.
దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందన్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. జైపాల్ రెడ్డి తనను కొడుకులా చూసుకున్నారని, ఆయన మరణ వార్తను తట్టుకోలేక పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలోని ఏదైన ఒక యూనివర్శిటీకి ఆయన పేరు పెట్టాలని కోరారు. జైపాల్ రెడ్డి పేరుతో ప్రభుత్వం స్మృతి స్థలం ఏర్పాటు చేయాలన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
అందరినీ కలుపుకుపోయో మహా మనిషి జైపాల్ రెడ్డి: చింతల రామచంద్రారెడ్డి
రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకుపోయో మహా మనిషి జైపాల్ రెడ్డి అన్నారు.. బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి. దేశానికి ఆయన అందించిన సేవలు మరువలేనివన్నారు. జైపాల్ రెడ్డి మృతిపట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు చింతల. దేశ, రాష్ట్ర రాజకీయాల్లో జైపాల్ రెడ్డి చాలా చురుగ్గా పనిచేశారన్నారు మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి. యువజన, విద్యార్థి నాయకునిగా ఉస్మానియా యూనివర్శిటీలో జైపాల్ రెడ్డి చేసిన ఉద్యమాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. జైపాల్ రెడ్డి లేని లోటు తీర్చలేనిదన్నారు యాదవ రెడ్డి.
రాష్ట్ర ఏర్పాటులో జైపాల్ రెడ్డిది కీలకపాత్ర: పొన్నం ప్రభాకర్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జైపాల్ రెడ్డి కీలకపాత్ర పోషించారన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్. జైపాల్ రెడ్డి మృతి పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బెస్ట్ పార్లమెంటేరియన్ గా, సీనియర్ కాంగ్రెస్ నాయకునిగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు పొన్నం. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంపీలందరికీ పెద్ద దిక్కుగా ఉండి రాష్ట్ర సాధన కోసం కృషి చేసారని కొనియాడారు. జైపాల్ రెడ్డి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు పొన్నం ప్రభాకర్.