నాని నిర్మాతగా విశ్వక్ సేన్ సినిమా

నాని నిర్మాతగా విశ్వక్ సేన్ సినిమా

నేచురల్ స్టార్ నాని నిర్మాతగా రెండో సినిమా షూటింగ్ ఘనంగా ప్రారంభమైంది. గతేడాది  నాని వాల్ పోస్టర్ ప్రొడక్షన్ ను స్థాపించి “ఆ” సినిమాను తెరకెక్కించారు. వైవిద్యమైన రచయితగా పేరుపొందిన ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేశాడు. ఈ సినిమాతో నాని మంచి అభిరుచి ఉన్న నిర్మాతగా, ప్రశాంత్ వర్మ డైరక్టర్ గా ఫర్వాలేదనిపించాడు. డైరక్టర్ ప్రశాంత్ వర్మ అభిమానులకు ఇచ్చిన ట్రీట్ మెంట్ బాగుంది. కథ, స్క్రీన్ ప్లే పై ఫోకస్ చేసి ఉంటే “ఆ”  సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించేది.

తాజాగా నాని వాల్ పోస్టర్ ప్రొడక్షన్ లో రెండో సినిమా షూటింగ్ ప్రారంభమైంది. పక్కా తెలంగాణ లోకల్ రియలిస్టిక్ సినిమాను ప్రెజెంట్ చేస్తూ విడుదలైన ఫలక్ నుమా దాస్. ఈ చిత్రంలో హీరోగా యాక్ట్ చేసిన విశ్వక్ సేన్ హీరోగా, చిలసౌ ఫేమ్ రుహానీ హీరోయిన్ గా నాని నిర్మాతగా “హిట్” సినిమాను తెరకెక్కిస్తున్నాడు. శైలేష్ ఈ చిత్రంతో డైరక్టర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇవాళ నుంచి ప్రారంభమైన ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల చేయనున్నట్లు నిర్మాత నాని చెప్పాడు.