12 మందిని కాపాడి బ్లడ్‌‌ ఇన్‌ఫెక్షన్‌‌తో మరణించాడు

12 మందిని కాపాడి బ్లడ్‌‌ ఇన్‌ఫెక్షన్‌‌తో మరణించాడు

పోయినేడాది థాయిలాండ్‌‌లోని ఓ ఫుట్ బాల్ టీంకు చెందిన12 మంది టీనేజర్లు, కోచ్ గుహలో ఇరుక్కుపోయిన సంఘటన గుర్తుందా? గుహలో 17 రోజలు పాటు చిక్కుకుపోయిన వాళ్లను థాయ్ నేవీ సీల్, ఇతర ఇంటర్నేషనల్ రెస్క్యూ టీం సురక్షితంగా బయటికి తీసుకొచ్చింది. అయితే, ఆ రెస్క్యూ ఆపరేషన్ సందర్భంగా గుహలో బ్లడ్ ఇన్​ఫెక్షన్‌‌కు గురైన థాయ్ నేవీ డైవర్ బీరుట్ పక్బారా శుక్రవారం చనిపోయారు. ఇన్ ఫెక్షన్ సోకినప్పటి నుంచీ ఆయనను హాస్పిటల్లోనే ఉంచి అన్ని రకాలుగా ట్రీట్ మెంట్ ఇస్తూ వచ్చామని, కానీ ఆయన కోలుకోలేదని నేవీ అధికారులు వెల్లడించారు. శుక్రవారం శాటన్ ప్రావిన్స్‌‌లోని ఆయన ఇంటి వద్ద ఇస్లాం ట్రెడిషన్ ప్రకారం అంత్యక్రియలు పూర్తి చేశామని తెలిపారు. కాగా, థాయిలాండ్‌‌లోని థామ్ లువాంగ్ కేవ్‌‌లో గత ఏడాది జూన్ 23న ఒక్కసారిగా వరదలు ముంచెత్తడంతో ఫుట్ బాల్ టీం చిక్కుకుపోయింది. రెస్క్యూ ఆపరేషన్ సందర్భంగా సమన్ గునాన్ అనే మరో థాయ్ నేవీ సీల్ డైవర్ కూడా చనిపోయారు. ఆ గుహ ఎంట్రన్స్ వద్ద సమన్ స్టాచ్యూను పెట్టారు.