- ఛత్తీస్‌గఢ్ లోని పర్సేగఢ్, రాణీబోద్లీ మధ్య ఘటన
- పర్సేగడ్ ఎస్‌హెచ్‌వో, హెడ్‌కానిస్టేబుల్‌కు తప్పిన ముప్పు
భద్రాచలం, వెలుగు : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు బుధవారం సీఐ ప్రయాణిస్తున్న కారును మందుపాతరతో పేల్చారు. అయితే, వాహనానికి ముందు పేలడంతో ముప్పు తప్పింది. బీజాపూర్ జిల్లా పర్సేగఢ్ పోలీస్స్టేషన్హౌస్ఆఫీసర్ ఆకాశ్ మసీహ్, హెడ్ కానిస్టేబుల్సంజయ్ బీజాపూర్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ ఆఫీసులో మీటింగ్‌కు వెళ్తున్నారు. పర్సేగఢ్–-రాణీబోద్లీల మధ్య సోమన్‌పల్లి గ్రామం వద్దకు రాగానే మావోయిస్టులు ముందుగానే అమర్చిన మందుపాతరను పేల్చారు. ఈ పేలుడులో కారు ముందు భాగం ధ్వంసం కాగా సీఐ ఆకాశ్మసీహ్, హెడ్ కానిస్టేబుల్ సంజయ్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
కాగా రాణీ బోద్లీ పోలీస్‌స్టేషన్ నుంచి రోడ్ఓపెన్ పార్టీ తనిఖీలు నిర్వహిస్తూ ఇదే మార్గంలో వస్తోంది. వీరిని లక్ష్యంగా చేసుకుని మందుపాతర అమర్చినట్టు తెలుస్తోంది. ముందుగా సీఐ కారు రావడంతో గుర్తించి పేల్చారు. పారిపోయిన మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు.
నారాయణ్‌పూర్‌లో మందుపాతర నిర్వీర్యం
నారాయణ్‌పూర్ జిల్లా చోటేడాన్గర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాటేనార్, గౌర్ దండ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో భద్రతాబలగాలను లక్ష్యంగా చేసుకుని ఏర్పాటు చేసిన మందుపాతరను నిర్వీర్యం చేశారు. కూంబింగ్‌కు వచ్చే బలగాలను చంపేందుకు మావోయిస్టులు ఏర్పాటు చేయగా, బాంబు స్క్వాడ్గుర్తించింది. దీంతో బలగాలకు ప్రమాదం తప్పింది.