విజయ్ తో జతకట్టనున్న నయనతార!

విజయ్ తో జతకట్టనున్న నయనతార!

విజయ్ దేవరకొండ క్రేజ్ మామూలుగాలేదు. ఇటు తెలుగులో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ఈ హీరోని తమిళులు కూడా అంతే అభిమానిస్తున్నారు. దాంతో అక్కడ కూడా మంచి మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రముఖ తమిళ నిర్మాత ఎస్‌ .ఆర్.ప్రభు ఓ భారీ బడ్జెట్‌‌ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడట. కొత్త దర్శకుడు రూపొందించే ఈ ప్రేమకథలో విజయ్ దేవరకొండను హీరోగా తీసుకున్నారని కోలీవుడ్ టాక్. అంతేకాదు… అతడి సరసన నయనతార యాక్ట్ చేస్తుందనే వార్తలూ వినిపిస్తు న్నాయి. ఆల్రెడీ ఆమె కథ విన్నదని, చేయడానికి సుముఖం గానే ఉందని సమాచారం. ఈ వార్త ఎంతవరకూ నిజమో తెలీదు కానీ అప్పుడే ఈ క్రేజీ కాంబినేషన్‌‌ గురించి సోషల్ మీడియాలో చర్చలు జరుగు తున్నాయి. అవును మరి. నయనతార లాంటి లేడీ సూపర్ స్టార్‌ తో మన సెన్సేషనల్ స్టార్ జోడీ కట్టడమంటే మామూలు విశేషమా.