మరికొన్ని గంటల్లో నయన్ - విఘ్నేష్ పెళ్లి

మరికొన్ని గంటల్లో నయన్ - విఘ్నేష్ పెళ్లి

మరికొద్ది గంటల్లో ప్రముఖ స్టార్ హీరోయిన్ నయనతార, నటుడు విఘ్నేష్ శివన్ వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. దాదాపు 7ఏళ్ల నిరీక్షణకు నేటితో తెర పడనుంది. 2021లో నిశ్చితార్థం జరగగా.. రేపు (జూన్ 9న) మహాబలిపురంలోని ఒక ప్రైవేట్ రిసార్ట్ లో వీరి వివాహం జరగనుంది. ఇప్పుటికే వీరికి సంబంధించిన ఓ వెడ్డింగ్ వీడియో కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో సంప్రదాయ పద్ధతిలో జరగనున్న వీరి పెళ్లికి భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. మొదట వీరి వివాహం తిరుపతిలో జరగునున్నట్టు అనౌన్స్ చేసినా... కొన్ని కారణాల వల్ల మహాబలిపురానికి మార్చినట్టు విఘ్నేష్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 

ఇదిలా ఉండగా నయనతార లైఫ్ లో చాలా మలుపులు ఎదురయ్యాయి. ముందు హీరో శింబు.. ఆ తర్వాత కొరియోగ్రాఫర్ కమ్ హీరో కమ్ దర్శకుడు ప్రభుదేవాతో ప్రేమాయణం నడిపిన ఈ బ్యూటీ.. ఇప్పుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో పడింది. మొదట్లో ఇది కూడా సక్సెస్ అవుతుందా లేక.. అని పెదవి విరిచిన వారూ లేకపోలేదు. ప్రభుదేవాతో త్వరలోనే పెళ్లి అంటూ అప్పట్లో తెగ ప్రచారం జరిగింది కూడా. కానీ పలు అంతర్గత కారణాల వల్ల శింబు, ప్రభుదేవాల నుంచి విడిపోయి కెరీర్ పై దృష్టి సారించింది నయనతార. ఫైనల్ గా విఘ్నేష్ ను వివాహం చేసుకుంటుందని తెలిసి.. ఆమె ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతం ఎవరికైనా ఉంటుంది. కాని గతాన్ని పాఠంగా తీసుకొని.. భవిష్యత్తులో ముందుకు సాగేవారు కొంతమందే ఉంటారు. అలా నయనతార కూడా భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకుంటారని.. తన వైవాహిక జీవితం సాఫీగా ఉండాలని ఆశిద్దాం.