నయన్- విఘ్నేష్ వెడ్డింగ్ లుక్

నయన్- విఘ్నేష్ వెడ్డింగ్ లుక్

నయన్- విఘ్నేష్ వివాహం నేడు మహాబలిపురంలో ఘనంగా జరిగింది. అతిరథ మహారధుల ఆశీర్వాదాలతో ఒక్కటైన ఈ జంట.. గత ఏడేళ్ల నుంచీ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. కాగా ఫైనల్ గా ఈ రోజు మూడు ముళ్ల బంధంతో.. ఏడడుగులు నడిచి.. తమ కొత్త జీవితానికి నాంది పలికారు నయన్ - విఘ్నేష్. వీరి వివాహానికి సినీ పరిశ్రమకు చెందిన పలువురు స్టార్ సెలబ్రెటీలు హాజరై సందడి చేశారు. ఈ నేపథ్యంలో నయనతార- విఘ్నేష్ శివన్ ల వెడ్డింగ్ కి సంబంధించి ఓ పిక్ వైరల్ అవుతోంది. నయన్ నుదుటిపై విఘ్నేష్ ముద్దు పెడుతున్న ఈ ఫొటో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ఫొటోను స్వయానా విఘ్నేషే షేర్ చేయడంతో సోషల్ మీడియాలో ఈ ఫొటో చక్కర్లు కొడుతోంది.