V6 News

లెన్స్కార్ట్ స్టోర్కు వెళ్లి హిందూ ఉద్యోగులకు బొట్టు పెట్టిన నజియా ఎలాహి ఖాన్ !

లెన్స్కార్ట్ స్టోర్కు వెళ్లి హిందూ ఉద్యోగులకు బొట్టు పెట్టిన నజియా ఎలాహి ఖాన్ !

గ్రూమింగ్ గైడ్ కారణంగా వివాదంలో చిక్కుకున్న కళ్లజోళ్ల కంపెనీ లెన్స్కార్ట్ ముంబైలో బీజేపీ మైనారిటీ మోర్చా మహిళా నేత నజియా ఎలహి ఖాన్  స్టోర్ విజిట్తో మరోసారి వార్తల్లో నిలిచింది. ముంబైలోని లెన్స్కార్ట్ స్టోర్కు వెళ్లిన నజియా అక్కడ ఉన్న స్టోర్ మేనేజర్ ఎవరని అడిగారు. ఆ స్టోర్ మేనేజర్ ఆమె దగ్గరకు వెళ్లి ‘‘నేనే మేడం’’ అని ఆమెకు బదులిచ్చాడు. ‘‘నీ పేరేంటి’’ అని స్టోర్ మేనేజర్ను ఆమె అడగగా.. తన పేరు మొహ్సిన్ ఖాన్ అని చెప్పాడు.

మొహ్సిన్ ఖాన్ కావడం వల్ల ఈ స్టోర్లో పనిచేసే హిందూ ఉద్యోగులు తిలకం పెట్టుకోకూడదని ఆంక్షలు విధించావా అని ఆమె అతనిని నిలదీశారు. అలా ఏం లేదు మేడం అని అతను చెప్పాడు. ‘‘నువ్వు మొహ్సిన్ ఖాన్ కాబట్టి అందరినీ మొహ్సిన్ ఖాన్స్గా మారుద్దామనుకుంటున్నావా..? ముస్లింలు పాకిస్తాన్ను ఇప్పటికే లాగేసుకున్నారు.. షరియా చట్టాన్ని ఇండియాలో కూడా అమలు చేయాలని చూస్తున్నావా..?’’ అని నజియా సదరు స్టోర్ మేనేజర్పై మండిపడ్డారు.

ఇంతటితో అయిపోలేదు. ఆ స్టోర్లో పనిచేస్తున్న హిందూ ఉద్యోగులను ఒక్కొ్క్కరిని తన దగ్గరకు పిలిచి అందరికీ బొట్టు పెట్టారు. అయితే.. బీజేపీ నేత నజియా ఎలహి ఖాన్ చేసిన పనిపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన రావడం గమనార్హం. కొందరు ఆమె చేసిన పనిని సమర్థిస్తుంటే.. మరికొందరు మాత్రం.. "ఆ గ్రూమింగ్ డాక్యుమెంట్‌ను ఎవరు తయారు చేశారో, దానికి ఎలా ఆమోదం లభించిందో తెలుసుకుని వారిని శిక్షించకుండా, కింది స్థాయి ఉద్యోగుల వెంట ఎందుకు పడుతున్నారు? ఈ వ్యక్తి కేవలం ఆదేశాలను పాటిస్తూ ఉండవచ్చు. అసలు పెద్ద వాళ్ళను పట్టుకోండి," అని ఒక యూజర్ ట్వీట్ చేశారు.

ALSO READ : బైక్పై హైవే మీద రయ్ రయ్మని దూసుకెళ్లిన అన్నదమ్ములు..

తేదీ లేని ఒక లెన్స్‌కార్ట్ ‘‘గ్రూమింగ్ గైడ్’’ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం మొదలైంది. లెన్స్ కార్ట్ ఉద్యోగులను ఉద్దేశించిన ఆ గైడ్లో.. ఉద్యోగులు బొట్టు, తిలకం పెట్టుకోవడంపై నిషేధం విధించినట్లుగా ఉంది. హిజాబ్‌కు సంబంధించి అలాంటి ఆంక్షలేవీ కనిపించలేదు. ఇక్కడే వివాదం మొదలైంది. ముస్లిం ఉద్యోగులకు లేని ఆంక్షలు హిందూ ఉద్యోగులకు ఎలా వర్తిస్తాయని హిందూ సంఘాలు మండిపడ్డాయి. లెన్స్‌కార్ట్ ఈ వివాదం విషయంలో క్షమాపణ కూడా చెప్పడం గమనార్హం. బిందీ, తిలక్, కలవా, కడా, హిజాబ్, తలపాగా వంటి విశ్వాస చిహ్నాలను స్వాగతిస్తూ సవరించిన గైడ్ను రిలీజ్ చేసినప్పటికీ వివాదం చల్లారలేదు.