బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రాజీనామా

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రాజీనామా

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ నజ్ముల్ హసన్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల బంగ్లాదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నజ్ముల్ హసన్‌  ఎంపీగా విజయం  సాధించారు. అనంతరం యువజన, క్రీడల మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టారు.  దీంతో బీసీబీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు.  

2012 నుంచి  బీసీబీ ఛైర్మన్ గా  నజ్ముల్ హసన్‌  సేవలు అందిస్తున్నారు. ఇటు మంత్రిగా, అటు  బీసీబీ ఛైర్మన్ గా కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ హసన్‌ ఒక్కదానినే ఎంచుకున్నారు.  ఒకవేళ బీసీబీ ఛైర్మన్ గా తాను కొనసాగితే కేవలం క్రికెట్‌కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తానన్న ఆరోపణలు ఉండవచ్చు అందుకే తాను క్రీడల మంత్రికే  ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నానని చెప్పారు.  

అయితే, ఐసీసీ నిబంధనల ప్రకారం క్రికెట్ బోర్డులో గవర్నింగ్ బాడీని ఎన్నుకుంటే దాని పదవీకాలం పూర్తి కావాలి.. దీని ప్రకారం, నజ్ముల్ అక్టోబర్ 2025 వరకు పదవిలో కొనసాగడం తప్పనిసరి.. దీంతో పాటు బోర్డు కార్యకలాపాల్లో ప్రభుత్వ జోక్యం ఉండకూడదు అనే విషయం కూడా స్పష్టం చేయాలి.. అలాంటి పరిస్థితిలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా త్వరగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే అంశంపై ఐసీసీతో చర్చిస్తుంది.