భయం నా బయోడెటా లోనే లేదు

భయం నా బయోడెటా లోనే లేదు


మాస్ హీరో నందమూరి బాలకృష్ణ,  డైరెక్టర్ గోపీంచంద్ మలినేని కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. #NBK107 అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతోంది.  రేపు(జూన్ 10)న బాలకృష్ణ  పుట్టినరోజు సందర్భంగా అభిమానుల కోసం సినిమా నుంచి టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్.  పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది.  మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్,నా జీవో గాడ్స్ ఆర్డర్. భయం నా బయోడేటా లోనే లేదు. నరకడం మొదలు పెడితే ఏ పార్ట్ ఏదో కూడా తెలియదు నా కొడక్కల్లారా ? టీజర్ లో ఇలాంటి డైలాగ్స్ వింటుంటే గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాలో బాలయ్య సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు.  క్రాక్ తర్వాత గోపీంచంద్ మలినేని, ఆఖండ తర్వాత బాలయ్య నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు గోపిచంద్ మలినేని తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించబోతున్నాడు బాలకృష్ణ. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ లో ప్రారంభం కాబోతుంది. ఈ సినిమా ‘బ్రో..ఐ డొంట్ కేర్’ అనే టైటిల్ తో తెరకెక్కబోతున్నట్టు టాక్ వస్తుంది.