మహిళలకు సత్వర న్యాయం జరిగేలా దర్యాప్తు చేయాలి : విజయ కిశోన్‌‌ రహత్కర్

మహిళలకు సత్వర న్యాయం జరిగేలా దర్యాప్తు చేయాలి : విజయ కిశోన్‌‌ రహత్కర్
  • ఎన్‌‌సీడబ్ల్యూ చైర్ పర్సన్‌‌ విజయ కిశోన్‌‌ రహత్కర్

హైదరాబాద్‌‌,వెలుగు: మహిళలపై జరుగుతున్న దాడులకు సంబంధించిన అన్ని కేసుల్లో వెంటనే న్యాయం జరిగేలా దర్యాప్తు చేయాలని ఎన్‌‌సీడబ్ల్యూ చైర్ పర్సన్‌‌ విజయ కిశోన్‌‌ రహత్కర్ అధికారులను ఆదేశించారు.  గృహహింస, ఆన్‌‌లైన్‌‌ వేధింపులు సహా మహిళల ఫిర్యాదులను పరిష్కరించడంలో వేగంగా స్పందిస్తున్న మల్కాజ్‌‌గిరి కమిషనరేట్ పోలీసులను అభినందించారు. నేరేడ్‌‌మెట్‌‌లోని మల్యాజ్‌‌గిరి కమిషనరేట్‌‌లో గురువారం మహా జన్ సున్‌‌ వాయ్ పేరిట పబ్లిక్ హియరింగ్‌‌ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి డీజీపీ శివధర్ రెడ్డి, విమెన్‌‌ సేఫ్టీ వింగ్‌‌ డీజీ చారుసిన్హా సహా పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మేడ్చల్–మల్కాజ్‌‌గిరి జిల్లాకు చెందిన 30 ఫిర్యాదులను ఆమె పరిశీలించారు. మరో ఐదు ఫిర్యాదులను ప్రత్యక్షంగా స్వీకరించారు.  వర్క్‌‌ ప్లేస్‌‌లో మహిళలపై వేధింపులు, సైబర్ నేరాలను పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు.