యూపీఎస్సీ ప్రిలిమ్స్‌‌కు 50%  మంది గైర్హాజరు

యూపీఎస్సీ ప్రిలిమ్స్‌‌కు 50%  మంది గైర్హాజరు

హైదరాబాద్ సిటీ, వెలుగు: యూపీఎస్‌‌సీ ప్రిలిమినరీ పరీక్షలు తెలంగాణలో ప్రశాంతంగా ముగిశాయి. ఈ పరీక్ష కోసం రాష్ట్రంలో హైదరాబాద్‌‌, వరంగల్‌‌లలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే, హైదరాబాద్ సిటీలో ఈ ఎగ్జామ్‌‌కు 50 శాతం మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. సిటీలో మొత్తం 58,871 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా, వారిలో 29,539 మంది గైర్హాజయ్యారు. మొదటి సెషన్‌‌లో 44,205 మంది అభ్యర్థులకు.. 29,609 మంది పరీక్ష రాయగా, 14,596 మంది గైర్హాజరయ్యారు.

రెండో సెషన్‌‌కు 29,262 మంది హాజరు కాగా, 14,943 మంది ఆబ్సెంట్ అయ్యారు. సైఫాబాద్‌‌లోని యూనివర్సిటీ కాలేజ్‌‌ ఆఫ్ సైన్స్‌‌లో 119 మంది దివ్యాంగ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎగ్జామ్‌‌ సెంటర్‌‌‌‌ను జిల్లా ఇన్‌‌చార్జ్ కలెక్టర్ సి. నారాయణ రెడ్డి పరిశీలించారు. అనంతరం మాసబ్ ట్యాంక్‌‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్, ఉమెన్స్ సెయింట్ ఆన్స్ కాలేజీల్లోని పరీక్షా కేంద్రాలను కూడా ఆయన తనిఖీ చేశారు.