- బీఫాంలు అందించిన నీలం మధు, కాట శ్రీనివాస్ గౌడ్
పటాన్చెరు,వెలుగు: తెలంగాణ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తే చాలు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్చార్జి నీలం మధు, పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కాట శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం ఐదు మున్సిపాలిటీల పరిధిలోని కాంగ్రెస్ అభ్యర్థులకు బీ ఫాంలు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ.. ప్రజల మద్దతు ఉన్న నాయకులకే టికెట్లు కేటాయించినట్లు తెలిపారు.
టికెట్లు రాని అభ్యర్థులు అధైర్య పడాల్సిన అవసరం లేదని పార్టీ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాబోయే నామినేటెడ్ పదవులతో పాటు పార్టీ పదవుల్లో పెద్దపీటవేస్తామని హామీ ఇచ్చారు. ఆ నేతలు నిరుత్సాహపడకుండా కాంగ్రెస్ గెలుపు కోసం ఐక్యంగా కృషి చేయాలని కోరారు.
