నీరజ్ చోప్రా అడ్వెంచర్..

నీరజ్ చోప్రా అడ్వెంచర్..

భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా..స్విట్జర్లాండ్ వెకేషన్ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. డైమండ్ లీగ్  ఛాంపియన్గా నిలిచిన అతను..స్విట్జర్లాండ్‌ లో..ఫుల్ చిల్ అవుతున్నాడు.  తాజాగా స్విట్జర్లాండ్లో  స్కై డైవింగ్‌ చేసి..ఫ్యాన్స్ను ఖుషీ చేశాడు..దీనికి సంబంధించిన ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేశాడు.

చిరునవ్వులు చిందిస్తూ స్కైడైవ్‌..
జిందగీ నా మిలేగీ దుబారా అనే బాలీవుడ్‌ మూవీలో చేసినట్లే నీరజ్‌ ఈ స్కైడైవింగ్‌ చేయడం విశేషం. అంతేకాదు..అతను  స్కైడైవింగ్‌ వీడియోకు కూడా ఈ మూవీలోని పాటనే బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే చేశాడు. ఆకాశం మధ్యలో విమానం నుంచి దూకే సమయంలో నీరజ్‌ ఎంతో ఉత్సాహంగా కనిపించాడు. చిరునవ్వులు చిందిస్తూ స్కైడైవ్‌ను ఎంజాయ్ చేశాడు. స్కైడైవ్‌ వీడియోను తన ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేసి ‘‘ఆకాశం హద్దే కాదు..’’ అనే క్యాప్షన్‌ను జతచేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. రెండు రోజుల్లోనే  నాలుగు లక్షలకుపైగా లైక్స్ రావడం విశేషం. నీరజ్ చోప్రా స్కై డైవింగ్ ను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

కొత్తేమి కాదు..
నీరజ్‌కి స్కైడైవింగ్ చేయడం కొత్తేమీ కాదు. అతను గతేడాది దుబాయ్‌లో తన విహారయాత్రలో స్కైడైవింగ్‌ చేశాడు. 

నీరజ్...వరల్డ్ జావెలిన్ స్టార్..
గతేడాది టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా..ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌లో సిల్వర్ తో మెరిశాడు. ఆ తర్వాత ఇటీవలే జరిగిన డైమండ్‌లీగ్‌ ట్రోఫీని సాధించి చరిత్ర సృష్టించాడు.  డైమండ్‌ లీగ్‌లో ఈటెను 88.44 మీటర్ల దూరం విసిరి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. దీంతో వచ్చే ఏడాది హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ బెర్తును కూడా నీరజ్‌ ఖరారు చేసుకున్నాడు.