సిబ్బంది లేక.. రోదిస్తూ.. నెట్టుకెళ్తూ..

సిబ్బంది లేక.. రోదిస్తూ.. నెట్టుకెళ్తూ..

కామారెడ్డి , వెలుగు: సర్కారు దవాఖానాల్లో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల కనీసం కనికరం చూపించడం లేదు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పల్వంచకు చెందిన బొమ్మెర చంద్రశేఖర్​కు గురువారం కడుపునొప్పి రాగా, అంబులెన్స్ లో జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చారు. పేషెంట్​ను ఐసోలేషన్ వార్డుకు తీసుకెళ్లాలని డాక్టర్ సూచించాడు. సిబ్బంది స్పందించకపోవడంతో భార్య రేణుక స్ట్రెట్చర్ మీద భర్తను ఐసోలేషన్ వార్డుకు తీసుకెళ్లగా.. కొడుకు సామాను పట్టుకుంటూ వెంట నడిచాడు.