అనుమతివ్వలే.. తిరస్కరించలే.. ఫామ్ 6లో మార్పులపై సుప్రీం క్లారిటీ..ఈసీఐ వాదనలను తోసిపుచ్చిన ధర్మాసనం

అనుమతివ్వలే.. తిరస్కరించలే.. ఫామ్ 6లో మార్పులపై సుప్రీం క్లారిటీ..ఈసీఐ వాదనలను తోసిపుచ్చిన ధర్మాసనం

 న్యూఢిల్లీ: ఓటర్ల నమోదు కోసం ఉద్దేశించిన ఫామ్-6 లో మార్పులపై తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, దాన్ని ‘అంగీకరించనూ లేదు.. తిరస్కరించనూ లేదు’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బిహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) విచారణ సమయంలో ఫామ్-6 మార్పులపై ఎలాంటి తుది విచారణ జరగలేదని తేల్చి చెప్పింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మాల్యా బాగ్చి, జస్టిస్ వి. మోహనల ధర్మాసనం సోమవారం ఈ వ్యాఖ్యలు చేసింది.

కోర్టు ఆదేశాలను తప్పుగా అన్వయించవద్దు

ఫామ్-6 లో మార్పులను సుప్రీంకోర్టు సమర్థించిందని ఈసీఐ చెబుతోందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన జస్టిస్ బాగ్చి.. బిహార్ సర్​ వ్యవహారం విచారణకు వచ్చినప్పుడు ఫామ్-6 లో మార్పుల అంశమే లేదని గుర్తుచేస్తూ.. కాబట్టి దానికి ఆమోదమో లేక తిరస్కరణో అనలేమని పేర్కొన్నారు. విచారణ సందర్భంగా కోర్టు అన్న మాటలను అతిగా విశ్లేషించవద్దని న్యాయవాదులను సీజేఐ హెచ్చరించారు.

ఏంటి ఈ ఫామ్-6 వివాదం?

చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించకుండా ఎన్నికల సంఘం ఫామ్-6లో మార్పులు చేసిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొత్త రూల్స్​ ప్రకారం ఓటరుగా నమోదు చేసుకునేవారు తమ తల్లిదండ్రులు లేదా పూర్వీకులు గత ఎస్ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నారో లేదో తెలపాలి. ఎలాంటి చట్టసవరణ లేకుండా కేవలం సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ ద్వారా ఈసీ ఈ రూల్​ తీసుకొచ్చిందని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. దీనిపై మే 2026 తీర్పులో సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఈసీ ప్రకటించగా, తాజాగా ధర్మాసనం దాన్ని తోసిపుచ్చింది.