నేపాల్‌లో వెయ్యి దాటిన డెత్స్.. ఇంకా 4 వేల మంది మిస్సింగ్

నేపాల్‌లో వెయ్యి దాటిన డెత్స్.. ఇంకా 4 వేల మంది మిస్సింగ్

 

  •     158 మంది భారతీయులను రక్షించిన రెస్క్యూ టీమ్స్
  •     నదుల్లో పెరిగిన ప్రవాహం.. ఫ్లాష్ ఫ్లడ్ అలెర్ట్ జారీ 

ఖాట్మాండు: నేపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మంగళవారం నాటికి 1,050 మంది డెడ్​బాడీలు లభ్యమైనట్టు అధికారులు తెలిపారు.  8 జిల్లాల నుంచి భద్రతా దళాలు మృతదేహాలను వెలికితీశాయని చెప్పారు. చిత్వాన్ జిల్లాలో 321, నవల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పరాసి తూర్పులో 216, నవల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పరాసి పశ్చిమంలో 170, నువాకోట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 95, గోర్ఖాలో 65, ధాడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 57, రసువాలో 41 మరియు తనహున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 38 మృతదేహాలను వెలికితీసినట్టు నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అథారిటీ వెల్లడించింది. అయితే, మరో 4 వేల మంది ఆచూకీ ఇంకా లభించలేదు. గల్లంతయిన వారి కోసం రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతంలోని రెండు జలవిద్యుత్ సొరంగాల వద్దకు భారత రక్షణ బృందాలు చేరుకున్నాయి. ఇప్పటివరకు 158 మంది భారతీయులను రక్షించారు. ఇంకా వందలాది మంది కార్మికుల ఆచూకీ తెలియడం లేదు. ఇప్పటివరకు 12 వేల మందిని రక్షించారు. ఇండియన్​ స్పెషల్​ టన్నెల్- రెస్క్యూ టీంలు సహా విదేశీ టీం​లతో గాలింపు విస్తృతంగా చేపడుతున్నారు.

మళ్లీ పొంచి ఉన్న వరద ముప్పు 

నేపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇంకా వరద ముప్పు పొంచి ఉంది. గిరాంగ్ ప్రాంతంలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇది సమీపంలోని బ్యారియర్ లేక్ నీటి మట్టాలను పెంచుతుందని చైనా వాతావరణ నిపుణులు హెచ్చరించారు. అంతేకాకుండా, హిమానీనదాలు (గ్లేసియర్స్) కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  కాగా, నేపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సంభవించిన హిమానీనద (గ్లేషియర్) వరదల నేపథ్యంలో సిక్కిం ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో ఉన్న 400కి పైగా సరస్సుల్లో అత్యంత ముప్పు ఉన్న 16 హిమానీనద సరస్సులను గుర్తించారు. గ్లేషియర్ లేక్ అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బర్స్ట్ ఫ్లడ్స్  ముప్పును ముందుగానే పసిగట్టేందుకు నీటి మట్టాలు, వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు గమనించేలా అధునాతన సెన్సార్లు, ఆటోమేటెడ్ వేదర్ స్టేషన్లు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను ఏర్పాటు చేశారు.  

 చావును దగ్గర నుంచి చూశాం..

నేపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరదల నుంచి బయటపడిన అస్సాంకు చెందిన 8 మంది కార్మికులు సురక్షితంగా తమ స్వగ్రామాలకు చేరుకున్నారు. వీరంతా అక్కడి 'అప్పర్ త్రిశూలి-1' జలవిద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తుండగా, ఒక్కసారిగా వరద నీరు, బురద ముంచెత్తింది.  కార్మికులు ఆహారం, నీరు లేకుండా రెండు రోజులు కొండపై గడిపారు. ఆ తర్వాత నేపాల్ సైనిక హెలికాప్టర్లు వీరిని గుర్తించి తరలించాయి. కళ్లముందే చావును చూశామని, అదృష్టవశాత్తూ బయటపడ్డామని వారు చెప్పారు.  కాగా, అక్కడే మరికొందరు కార్మికులు గల్లంతయ్యారు.   

శవాల గుర్తింపులో భారత్ సాయం 

నేపాల్​వరదల్లో కొట్టుకుపోయినవారి మృతదేహాల గుర్తింపునకు భారత్ రంగంలోకి దిగింది. మృతుల కుటుంబాలకు సహాయపడటానికి నేపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని భారత రాయబార కార్యాలయం మార్గదర్శకాలు జారీ చేసింది. నేపాల్ ప్రభుత్వం మృతుల ఫొటోలు, వివరాలను విడుదల చేస్తోందని, వాటిని ఒక వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లింక్ ద్వారా పొందవచ్చని పేర్కొంది. ఫొటోల ద్వారా మృతదేహాన్ని గుర్తిస్తే.. స్థానిక అధికారుల సహాయంతో మృతదేహాన్ని అప్పగించడం, స్వదేశానికి తరలించే బాధ్యతలను ఎంబసీ సమన్వయం చేస్తుందని తెలిపింది.