భూసారం పరీక్షకు సరికొత్త ప్రయోగం.. 2 వేల డ్రాయర్లతో మట్టి టెస్ట్!

భూసారం పరీక్షకు సరికొత్త ప్రయోగం.. 2 వేల డ్రాయర్లతో మట్టి టెస్ట్!
  • 2 వేల డ్రాయర్లతో మట్టి టెస్ట్!..
  • నేల నాణ్యతపై వర్సిటీ ఆఫ్ జ్యూరిచ్ సరికొత్త ప్రయోగం
  • 1000 మందితో అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను మట్టిలో పాతిపెట్టించిన శాస్త్రవేత్తలు
  • 2 నెలలకు తీసి ల్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టెస్టులు.. బట్ట కుళ్లిన విధానాన్ని బట్టి భూసార అంచనా
  • తోట నేలల్లో జీవుల క్రియాశీలత ఎక్కువ.. 
  • రసాయన ఎరువులు తగ్గిస్తేనే నేలకు రక్షణ అని నిపుణుల సూచన  

జ్యూరిచ్: నేలలో  రోజురోజుకూ జీవవైవిధ్యం తగ్గిపోతున్నది. ఇది మన వ్యవసాయాన్ని, ఆహార భద్రతను ప్రమాదంలో పడేస్తోంది. ఈ సమస్యను లోతుగా అధ్యయనం చేయడానికి స్విట్జర్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని యూనివర్సిటీ ఆఫ్ జ్యూరిచ్ కి చెందిన అగ్రోస్కోప్ పరిశోధకులు ఒక వినూత్న ప్రయోగానికి తెరలేపారు. 2021లో 'ప్రూఫ్ బై అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాంట్స్' పేరిట ప్రయోగం చేపట్టారు. ఇందులో స్విట్జర్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యాప్తంగా 1000 మంది పాల్గొన్నారు. వారంతా కలిసి 100% స్వచ్ఛమైన కాటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తయారు చేసిన 2 వేలకు పైగా అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను,  పన్నెండు వేల టీ బ్యాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను వివిధ ప్రాంతాల్లోని మట్టిలో పాతిపెట్టారు. 

నేలలోని సూక్ష్మజీవులు, వానపాములు, బాక్టీరియా ఎంత చురుగ్గా ఉంటే.. ఆ కాటన్ బట్ట అంత త్వరగా కుళ్లిపోయి విచ్ఛిన్నం అవుతుంది. బట్ట ఎంత శాతం కుళ్లిపోయిందనే దానిని బట్టి నేల ఎంత ఆరోగ్యంగా ఉందో, పోషకాలు ఏ స్థాయిలో ఉన్నాయో అంచనా వేయాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. అందులో భాగంగా మట్టిలో పాతిపెట్టిన అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను, టీ బ్యాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను సరిగ్గా రెండు నెలల తర్వాత మట్టిలో నుంచి బయటకు తీశారు. 

అవి ఏ స్థితిలో ఉన్నాయో ఫొటోలు తీసి, అక్కడి మట్టి నమూనాలతో పాటు పరీక్షల కోసం ల్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పంపారు. దీనికి సంబంధించిన అధికారిక ఫలితాలు ఇటీవల అంతర్జాతీయ సైన్స్ జర్నల్ 'ప్లాంట్స్, పీపుల్, ప్లానెట్' లో ప్రచురితమయ్యాయి. ల్యాబ్ ఫలితాల ప్రకారం..మట్టిలో పాతిపెట్టిన కాటన్ అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు వేగంతో కుళ్లిపోయినట్లు తేలింది. ఈ ప్రయోగం ద్వారా పరిశోధకులు నేల ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు శాస్త్రీయ సమాచారాన్ని  సేకరించారు. 

తోటల్లోనే జీవుల క్రియాశీలత ఎక్కువ

నేలలో ఉన్న చిన్న చిన్న సూక్ష్మజీవులు, వానపాములు, బాక్టీరియా ఎంత చురుగ్గా ఉంటే కాటన్ బట్టలు అంత త్వరగా విచ్ఛిన్నం అవుతాయి. అయితే, పరిశోధకులు తాము జరిపిన పరీక్షల్లో తోటల్లోని మట్టిలోనే అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల అత్యంత వేగంగా కుళ్లిపోయినట్లు గుర్తించారు. తోట నేలల్లో సేంద్రీయ పదార్థాలు మెండుగా ఉండటమే దీనికి ప్రధాన కారణమని చెప్పారు. కాటన్ వస్త్రం భూమిలో పాతిపెట్టడం వల్ల వానపాములు, శిలీంధ్రాలు జీవించడానికి మంచి వాతావరణం దొరికిందన్నారు.

 అలాగే, గడ్డి మైదానాల్లో మాత్రం మట్టి జీవుల క్రియాశీలత చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది. వ్యవసాయ పొలాలు, పచ్చిక బయళ్లు ఈ రెండింటికి మధ్యస్థంగా నిలిచాయి. మనం నేలను ఎలా వాడుతున్నాము? ఎలా కాపాడుకుంటున్నాము? అనే దానిపైనే నేల నాణ్యత ఆధారపడి ఉంటుందని ఈ ప్రయోగం నిరూపించినట్లు పరిశోధకులు పేర్కొన్నారు. 

నేలను ఎలా కాపాడుకోవాలి!

నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని మంచి పద్ధతులు పాటించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. నేల ఎప్పుడూ ఖాళీగా లేకుండా కప్పి ఉంచడం, కంపోస్ట్ ఎరువులు వాడటం, రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకాన్ని తగ్గించడం చాలా ముఖ్యమని తెలిపారు. బట్టలు త్వరగా కుళ్లిపోవడం కూడా నేలకు మంచిది కాదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అడవుల వంటి సహజ ప్రాంతాల్లో పోషకాలు ఎక్కువగా ఉంటే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందన్నారు. 

ఈ ప్రయోగం ద్వారా మట్టి సారాన్ని కొలవడానికి ఒక కొత్త 'అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ ఇండెక్స్'ను తీసుకురావాలని వారు భావిస్తున్నారు. ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎంతోమంది సాధారణ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని శాస్త్రవేత్తలకు సాయం చేశారు. దీనివల్ల స్విస్ నేలల గురించి అత్యంత సమగ్రమైన సమాచారం లభించింది. నేలను ఎలా రక్షించుకోవాలో ఈ ప్రయోగం మనకు చక్కటి పాఠం నేర్పుతోంది.