నల్గొండ, వెలుగు : అనుమానాస్పద స్థితిలో నీటి పారుదలశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ) చనిపోయారు. ఈ ఘటన నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లకు చెందిన సతీశ్ చంద్ర ఉదయసముద్రం ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్‌గా ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.
నార్కట్‌పల్లి మండలం చందనపల్లి డీ37 కాల్వలో సోమవారం ఆయన డెడ్‌బాడీని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకొని డెడ్‌బాడీని బయటకు తీశారు. కాగా, సతీశ్ చంద్ర ఆత్మహత్య చేసుకునేందుకు కాల్వలోకి దూకారా ? లేక డ్యూటీలో భాగంగా కాల్వను పరిశీలిస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి చనిపోయారా ? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
