
హైదరాబాద్: తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో ఓడిన నెదర్లాండ్స్ వరల్డ్ కప్‌లో మరో పరీక్షకు సిద్ధమైంది. సోమవారం ఉప్పల్ స్టేడియంలో జరిగే రెండో మ్యాచ్‌లో బలమైన న్యూజిలాండ్‌తో తలపడనుంది. టీమ్, రికార్డులు, ఆట పరంగా చూస్తే ఈ మ్యాచ్‌లో కివీస్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నది. దీనికి తోడు తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌ను ఓడించి న్యూజిలాండ్ మంచి జోష్ మీద కనిపిస్తోంది.