స్టార్ హీరో కూతురు చేసిన పనికి నెటిజన్స్ ఫిదా.. అడిగిన వెంటనే ఇచ్చేసింది

స్టార్ హీరో కూతురు చేసిన పనికి నెటిజన్స్ ఫిదా.. అడిగిన వెంటనే ఇచ్చేసింది

బాలీవుడ్ బాద్‌షా..కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shah rukh khan) కూతురిగా సుహానా ఖాన్(Suhana khan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బీటౌన్‌ జనాలకు ఈ అమ్మడు సుపరిచితమే. ఇప్పటివరకు తెరపై కనిపించినప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం చాలామంది అభిమానులను సంపాదించుకుంది. 

తాజాగా ఈ బ్యూటీ తన తల్లి గౌరీ ఖాన్‌తో కలిసి పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ఈవెంట్‌ నుంచి బయటకు వస్తుండగా.. ఒక మహిళా సుహానా ఖాన్‌ దగ్గరకు వెళ్లి సహాయం చేయమని అడిగింది. దీంతో వెంటనే తన బ్యాగ్‌లో నుంచి ఐదువందల రూపాయల నోట్లను తీసి ఇచ్చేసింది సుహానా. ఇదంతా ఒక వ్యక్తి తన కెమెరాలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దాంతో అది కాస్త క్షణాల్లో వైరల్ గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్స్ సుహానాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మా షారుఖ్ ఖాన్ కూతురు బంగారం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇక సుహానా ఇండస్ట్రీ ఎంట్రీ విషయానికి వస్తే.. త్వరలో ఆమె జోయా అక్తర్ తెరకెక్కిస్తున్న ది ఆర్చీస్‌ సినిమాతో ఎంట్రీ ఇవ్వనుంది. 2024 డిసెంబర్ లో ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.