
సోషల్ మీడియా వచ్చాక రోజుకో వార్త, రోజుకో వీడియో కావడం చూస్తూనే ఉన్నాం. ఇక ఈరోజు ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌లో ఉన్నదేంటంటే.. ఈ సెర్చ్‌కు సమాధానంగా చెప్పాలంటే, ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాలోని నాటు నాటు ( Naatu Naatu) సాంగ్ కు సంబంధించిన ఓ వీడియో. హీరోల ఫేస్ లను మార్ఫింగ్ చేసిన ఈ వీడియోలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ముఖాలకు బదులుగా ప్రధాని మోదీ, ఎలాన్ మస్క్ ముఖాలను చేర్చారు. ఈ డ్యాన్స్ వీడియో ఆన్‌లైన్ షేర్ కావడంతో.. ఇది నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
వైరల్ వీడియోపై నెటిజన్ల కామెంట్లు
ఆర్ఆర్ఆర్ చిత్రానికి అభిమానుల్లో ఒకరైన ఓ ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను క్రియేట్ చేసినట్టు తెలుస్తోంది. నటులు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆస్కార్ విన్నింగ్ పాటకు ప్రధాని మోదీ, ఎలాన్ మస్క్‌లు డ్యాన్స్ చేస్తున్నటటు ఈ వీడియోలో చూపించారు. "వెన్ లెజెండ్స్ మీట్" అనే చమత్కారమైన క్యాప్షన్‌ను కూడా ఈ వీడియోకు జత చేస్తూ షేర్ చేశారు.
సోషల్ మీడియాలో పోస్ట్ అయిన కొద్ది సేపటికే మైక్రోబ్లాగింగ్ సైట్‌లో డ్యాన్స్, రీల్ వైరల్‌గా మారి నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. దీనికి వేల సంఖ్యలో వ్యూస్, లైక్స్ వచ్చాయి. ఇక కామెంట్స్ బాక్స్ మొత్తం నవ్వుల ఎమోజీలతో నిండిపోయింది.
న్యూయార్క్‌లో ప్రధాని మోదీ-ఎలోన్ మస్క్ భేటీ
మూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా భారత ప్రధానిని న్యూయార్క్ వెళ్లారు. అక్కడ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ను కలిశారు. తాను మోదీకి వీరాభిమానినని మస్క్ ఈ సందర్భంగా చెప్పారు. "అతను (మోదీ) నిజంగా భారతదేశం కోసం సరైన పనులు చేయాలనుకుంటున్నాడని చెప్పగలను. అతను ఓపెన్‌గా ఉండాలని, కొత్త కంపెనీలకు మద్దతుగా ఉండాలని కోరుకుంటాడు. అదే సమయంలో అది భారతదేశానికి ప్రయోజనం చేకూర్చేలా చూసుకుంటాడు... నిజం చెప్పాలంటే నేను మోదీకి అభిమానిని" అని మస్క్.. ప్రధాని మోదీ నాయకత్వ పాత్రపై వ్యాఖ్యానించారు.