భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమం భద్రాద్రికొత్తగూడెం కలెక్టరేట్లో గత కలెక్టర్ జితేష్ వి పాటిల్ నిలిపివేయగా, కొత్తగా వచ్చిన కలెక్టర్ అంకిత్ గ్రీవెన్స్నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సోమవారం ఉదయం 10.30 కు ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ ఆదివారం పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలపై దరఖాస్తులు అందజేయాలని, ఈ కార్యక్రమానికి ఆఫీసర్లు సకాలంలో అటెండ్
కావాలన్నారు.
