ధర్మసాగర్ (వేలేరు), వెలుగు: ప్రజలకు అందుబాటులో ఉండేలా బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సోమవారం వేలేరు నుంచి హైదరాబాద్ వెళ్లే కొత్త ఎక్స్ ప్రెస్ బస్సు సర్వీస్ కు వేలేరు మండల కేంద్రంలో ఆయన ప్రారంభించారు. ఈ బస్సు సర్వీస్ వెళ్లే ఆయా గ్రామాల ప్రజలు, ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని సూచించారు.
అనంతరం ధర్మసాగర్ మండలం సాయిపేటలో ఎమ్మెల్యే పర్యటించారు. గ్రామంలో ప్రధాన రహదారి వెంట సైడ్ డ్రైన్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సర్పంచ్ కు సూచించారు.
