
రీసెంట్‌గా ‘రాయన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి రెస్పాన్స్‌ను అందుకున్నాడు ధనుష్. ఆదివారం ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా విషెస్ తెలియజేస్తూ.. తను నటిస్తున్న ‘కుబేర’ చిత్రం నుంచి కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ బర్త్‌డే పోస్టర్ చాలా ఇంటరెస్టింగ్‌గా ఉంది. ఇందులో బిచ్చగాడి గెటప్‌లో కనిపిస్తూ సర్‌ప్రైజ్ చేయనున్నాడు ధనుష్.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నాగార్జున మరో లీడ్ రోల్‌లో నటిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్. జిమ్ సర్భ్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. సోనాలి నారంగ్ సమర్పణలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తు న్నాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మల్టీ లాం గ్వేజ్ ప్రాజెక్ట్‌గా ఈ చిత్రం రూపొందుతోంది.