V6 News

ఎంటీఆర్ ఫుడ్స్ నుంచి కొత్త ప్రొడక్టులు

ఎంటీఆర్  ఫుడ్స్  నుంచి కొత్త ప్రొడక్టులు

హైదరాబాద్, వెలుగు: ఎంటీఆర్ ఫుడ్స్ హైదరాబాద్‌‌లో ‘మినిట్ ఫ్రెష్’ బ్యాటర్లను విడుదల చేసింది.  ప్రామాణిక రుచి, సౌకర్యం అందించడమే లక్ష్యంగా దోసె పిండి, రైస్ రవ్వ ఇడ్లీ పిండిని అందుబాటులోకి తెచ్చింది.  ఈ ఉత్పత్తులు క్విక్ కామర్స్, ఈ– కామర్స్ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌ల నుంచి లభిస్తాయి. 

రాబోయే రోజుల్లో మరిన్ని నగరాలకు ఈ సేవలు విస్తరిస్తామని కంపెనీ ప్రకటించింది. 425 గ్రాముల దోసె పిండి ప్యాక్ ధర  రూ.60 కాగా, 850 గ్రాముల ప్యాక్ ధర రూ.98 ఉంటుంది. ఒకటిన్నర కేజీ ప్యాక్ ధర రూ.150. రైస్ రవ్వ ఇడ్లీ పిండి 750 గ్రాముల ప్యాక్ ధర రూ.98.