న్యూయార్క్ లో వైభవంగా దీపావళి.. దీపాల కాంతిలో మెరిసిన ఎంపైర్ స్టేట్ బిల్డింగ్

న్యూయార్క్ లో వైభవంగా దీపావళి.. దీపాల కాంతిలో మెరిసిన ఎంపైర్ స్టేట్ బిల్డింగ్

న్యూయార్క్ నగర ప్రజలు దీపావళిని ఘనంగా జరుపుకున్నారు. ఐకానిక్ ఎంపైర్ స్టేట్ భవనం దీపాలతో నారింజ రంగులో వెలిగిపోయింది. న్యూయార్క్ నగర్ మేయర్ ఎరిక్ ఆడమ్స్, అంతర్జాతీయ వ్యవహారాల డిప్యూటీ కమిషనర్ దీలిప్ చౌహాన్ మాన్ హాటన్ లోని పురాతన హిందూ దేవాలయం భక్తి సెంటర్ లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడి హిందూ ప్రజలతో కలిసి దీపాల పండగను జరుపుకున్నారు. ఇప్పటికే దీపావళి రోజును న్యూయార్క్ నగరంలో పాఠశాలలకు సెలవు దినంగా  ప్రకటించారు. 

న్యూయార్క్ నగరంలోని మాన్ హట్టన్ లోని భక్తి సెంటర్ ఆలయంలో నిర్వహించిన దీపావళి వేడుకల్లో సుమారు 15వందల మంది పైగా హిందూ ప్రజలు పాల్గొన్నారు. మరోవైపు భారత్ లో కూడా యూఎస్ రాయబారి కమ్యూనిటి ఆదివారం దీపావళి పండగను జరుపుకుంది. యూఎస్ రాయబారి ఎరిక్ గార్సెట్టితో కలిసి ముగ్గులు, దీపాలు వెలిగించి స్వీట్లు పంచుకున్నారు. భారతీయ వేషధారణలో యూఎస్ ఎంబసీ కమ్యూనిటీ ముగ్గులువేయడం, రాయబార కార్యాలయాన్ని అలంకరణకు సంబంధించిన వీడియోను యూఎస్ ఎంబసీ సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేసింది. 

అంతకుముందు న్యూయార్క్ స్టేట్ సెనెటర్ కెవిన థామస్.. బుధవారం నాడు  జరిగిన దీపావళి వేడుకల్లో యూఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, ఆమె భర్త డగ్ ఎమ్ హాఫ్ తో కలిసి పాల్గొన్నారు . బుధవారం రాత్రి వాషింగ్టన్ డీసీలో కమలాహారీస్ తో కలిసి దీపావళి జరుపుకోవడం చాలా థ్రిల్లింగ్ గా ఉంది. దీపావళి  చీకటి నుంచి విముక్తి పొంది కాంతితో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. దీపావళి శుభాకాంక్షలు.. అని థామస్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.