సూర్యకుమార్ యాదవ్ ఆటతీరుకు కేన్ విలియమ్సన్ ఫిదా

సూర్యకుమార్ యాదవ్ ఆటతీరుకు కేన్ విలియమ్సన్ ఫిదా

టీమిండియా 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ న్యూజిలాండ్ కెప్టెన్ ప్రశంసల వర్షం కురిపించాడు. సూర్య యాదవ్‌ ఆటతీరుకు  కేన్‌ విలియమ్సన్‌ ఫిదా అయ్యాడు. సూర్యకుమార్‌ స్టైల్‌, ఆటతీరును తాను గతంలో ఎప్పుడూ చూడలేదన్నాడు. సూర్య ఇన్నింగ్స్ హైలెట్ అని చెప్పుకొచ్చాడు.  సూర్య కుమార్ వరల్డ్ లోనే అత్యుత్తమ ఆటగాడని పేర్కొన్నాడు. రెండో టీ20 ముగిసిన తర్వాత కేన్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు.

ఏమి షాట్లు అవి...
రెండో టీ20లో సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ పూర్తిగా భిన్నమైందని కేన్ విలియమ్సన్ అన్నాడు.  తన ఇన్నింగ్స్ లో  సూర్యకుమార్‌ కొట్టిన షాట్లను గతంలో ఎన్నడూ చూడలేదని చెప్పుకొచ్చాడు. సూర్య సెంచరీ చూసి తాను ఆశ్చర్యానికి గురైనట్లు తెలిపాడు. అయితే తాము రెండో టీ20లో గెలిచేందుకు మరింత కృషి చేయాల్సిందన్నాడు. 

రెండో టీ20లో మా జట్టు మంచిగా ఆడలేదు. బౌలింగ్, బ్యాటింగ్ లో విఫలమయ్యాం. అయితే ఈ మ్యాచ్ లో సూర్య ఇన్నింగ్స్ హైలెట్. అతని అత్యుత్తమ ప్రదర్శనల్లో ఇది ఒకటిగా నిలుస్తుంది. సూర్య ఆడిన కొన్ని షాట్లు నేను ఇప్పటి వరకు చూడలేదు. సూర్య ఇన్నింగ్స్ చాలా అంటే చాలా ప్రత్యేకమైంది. అతను అద్భుతంగా ఆడాడు..అని కేన్ విలియమ్సన్ వివరించాడు.