కొద్ది రోజుల క్రితమే పెళ్లి.. అంతలోనే నవ వధువు ఆత్మహత్య

V6 Velugu Posted on Jan 31, 2020

కొద్ది రోజుల క్రితమే పెళ్లి జరిగింది. ఏం కష్టం వచ్చిందో ఏమో అంతలోనే నవ వధువు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఎంతో సంతోషంగా ఉన్న రెండు కుటుంబాల్లో విషాదం నిండింది. హైదరాబాద్‌ శివారులో ఉన్న వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాసపురం కాలనీలో ఈ ఘటన జరిగింది.

మలక్‌పేటకు చెందిన పల్లవికి డిసెంబరు 8న పెళ్లి జరిగింది. అత్తారింటికి వెళ్లిన ఆమె నెలన్నరకే బలవన్మరణానికి పాల్పడింది. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణం తెలియాల్సి ఉంది. అయితే పల్లవి తల్లిదండ్రులు ఆమె భర్త కుటుంబసభ్యులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Tagged Hyderabad, woman, vanasthalipuram, suicide, Malakpet, newly married

Latest Videos

Subscribe Now

More News