అమ్మాయిలకు అవేర్​నెస్ ​కల్పిస్తున్న ఎన్జీవోలు

అమ్మాయిలకు అవేర్​నెస్ ​కల్పిస్తున్న ఎన్జీవోలు
  • అమ్మాయిలు, మహిళలకు అవేర్​నెస్ ​కల్పిస్తున్న ఎన్జీవోలు 
  • హెల్త్, హైజిన్ పైనా ప్రత్యేక సెషన్లు కండక్ట్​
  • రెండ్రోజుల నుంచి మూన్నెళ్ల దాకా ట్రైనింగ్

హైదరాబాద్, వెలుగు: స్కూల్ గర్ల్స్ నుంచి ఎంప్లాయీస్, గృహిణుల వరకు సెల్ఫ్​కాన్ఫిడెన్స్, సెల్ఫ్​డిఫెన్స్, హెల్త్​కేర్ పై​అవేర్​నెస్​చేసేందుకు రెండు ఎన్జీవో సంస్థలు కృషి చేస్తున్నాయి. స్కూళ్లలో, కాలేజీల్లో, స్కిల్​సెంటర్లలో ప్రత్యేక సెషన్లు ఏర్పాటు చేస్తున్నాయి. స్కిల్ సెంటర్లలో ఉండే అమ్మాయిలు, మహిళలకు కరాటే వంటి సెల్ఫ్ డిఫెన్స్ లో ట్రైనింగ్ ఇస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు హెల్త్ మీద ఫోకస్​చేయాలని, అందుకు ఉపయోగపడే హెల్త్ అండ్ హైజినిక్ అవేర్​నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. సిటీకి చెందిన ఐహోప్ టీం, యాక్సెస్ ఫౌండేషన్ సంస్థలు కలిసి శాస్త్రీపురంలోని జావియా స్కిల్ డెవలప్​మెంట్ సెంటర్ లో ‘సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ఫర్ గర్ల్స్ ప్రోగ్రాం’ కండక్ట్​ చేస్తున్నాయి. రెండు రోజుల నుంచి మూడు  నెలల పాటు సెషన్స్ ఉంటాయని నిర్వాహకులు చెప్తున్నారు. ప్రస్తుతం ఇందులో ఓల్డ్ సిటీకి చెందిన 50 మంది అమ్మాయిలు, మహిళలు.. కరాటే, ఫిట్​నెస్​లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. 

స్కూల్స్, కాలేజీల్లో సెషన్స్​..
సిటీలోని పలు స్కూల్స్, కాలేజీలకు వెళ్లి మేనేజ్​మెంట్​తో మాట్లాడి ఒకటి, రెండు రోజుల సెషన్స్ ఎన్జీవో నిర్వాహకులు నిర్వహిస్తున్నారు . ఈ సెషన్స్​లో ఫిట్​నెస్, ఎక్సర్‌‌‌‌సైజ్ వంటివి నేర్పిస్తున్నారు. ఏదైనా ఆపద కలిగినప్పుడు దాన్నుంచి ఎలా బయటపడాలో డెమోల ద్వారా చూపిస్తున్నారు. ఒంటరిగా వెళ్తున్నప్పుడో, వర్క్​ ఏరియాలో ఉన్నప్పుడో ఎవరైనా టీజ్​చేస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలో అవేర్​నెస్​కల్పిస్తున్నారు . అలాగే పీరియడ్స్​టైంలో స్కూల్ గర్ల్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పద్ధతుల గురించి ప్రత్యేకంగా చెప్తున్నారు.

డే సెషన్స్​తో పాటు మంత్లీ ప్రోగ్రామ్స్​
కరోనా.. టైంలో ఐహోప్ టీమ్ ని ఏర్పాటు చేశాం. లాక్ డౌన్ టైంలో నిత్యావసర వస్తువులు, ఫుడ్ ప్యాకెట్లు అందించాం. ఇందులో అన్ని రంగాలకు చెందిన ఉద్యోగులు, స్టూడెంట్లు ఉన్నారు.  దీంటో పాటు స్కూల్స్, కాలేజీ అమ్మాయిల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలని రీసెంట్ గా సేఫ్టీ, సెల్ఫ్ డిఫెన్స్ పై ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశాం. చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. 
- విజయ్, వలంటీర్, ఐ హోప్ టీమ్

అమ్మ తీసుకెళ్లి జాయిన్ ​చేసింది
సెవెన్త్ క్లాస్ చదువుతున్నా. ఇంటికి దగ్గర్లోని ఓ సెంటర్ లో అమ్మ ఎంబ్రాయిడరీ వర్క్ నేర్చుకునేందుకు వెళ్తుంది. అక్కడికి కొంతమంది వచ్చి కరాటే నేర్పిస్తున్నారని నన్ను కూడా తీసుకెళ్తోంది. స్కూల్ అయిపోయిన తర్వాత ఒకరోజు వెళ్లా. డీటెయిల్స్ తీసుకుని క్లాసెస్ తీసుకుంటున్నారు. పంచింగ్, కిక్కింగ్​తో పాటు సెల్ఫ్​ డిఫెన్స్ ట్రిక్స్​ నేర్పిస్తున్నారు.
- ఫాతిమా, స్టూడెంట్, శాస్త్రీపురం