కోడి కత్తి కేసు.. సీఎం జగన్ కు కోర్టు ఆదేశాలు

కోడి కత్తి కేసు.. సీఎం జగన్ కు కోర్టు ఆదేశాలు

కోడి కత్తి కేసులో విచారణకు హాజరుకావాలంటూ  ఏపీ సీఎం జగన్  కు  ఎన్ఐఏ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.  ఏప్రిల్ 10న విచారణకు రావాలని స్పష్టం చేసింది. జగన్ తో పాటు ఆయన  పీఏ నాగేశ్వర్ రెడ్డి కూడా కోర్టుకు హాజరుకావాలని  ఆదేశాలు జారీ చేసింది. 

కోడి కత్తి కేసుపై విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో విచారణ జరిగింది.  ఈ సందర్బంగా ఎయిర్ పోర్ట్ అథారిటీ కమాండర్ దినేష్ ను విచారించింది. కేసుకు సంబంధించిన కోడికత్తి, మరో చిన్నకత్తి, పర్సు, సెల్ ఫోన్ ను పోలీసులకు కోర్టుకు సమర్పించారు.  అనంతరం  తదుపరి విచారణను  కోర్టు ఏప్రిల్ 10కి వాయిదా వేసింది.