దానివల్ల లేనిపోని ఒత్తిడి.. నిహారిక పోస్ట్ వైరల్

దానివల్ల లేనిపోని ఒత్తిడి.. నిహారిక పోస్ట్ వైరల్

విడాకుల విషయం తరువాత సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నారు మెగా డాటర్ నిహారిక కొణిదెల(Niharika konidela). ఆమె గురించి ఏ చిన్న వార్త వినిపించినా అది క్షణాల్లో వైరల్ అవుతోంది. ఇక విడాకుల విషయంలో కూడా ఆమె చాల ట్రోల్స్ ను ఎదుర్కొంది. కానీ అవేవి పట్టించుకోకుండా తనపనేదో తాను చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక తాజాగా నిహారిక పెట్టిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ప్రతీ మనిషి జీవితంలో కొన్ని వలయాలు ఉంటాయి. అవి ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. కాదు అలా జరగకూడదని, అక్కడే ఆగిపోవాలని అనుకుంటే దాని సహజగుణానికి అడ్డుపడుతున్నట్లే అవుతుంది. దీనివల్ల లేనిపోని ఒత్తిడి తప్ప మరేం ఉండదు. కాబట్టి జీవితం ఎటువైపు తీసుకువెళ్తే అటు వెళ్లండి. ఆ ప్రయాణం ఎక్కడికి వెళ్తుందో తెలిశాక నువ్వే సర్‌ప్రైజ్‌ అవుతావు అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఇక నిహారిక సినిమాల విషయానికి వస్తే.. పెళ్లి తరువాత నటనకు దూరమైనా నిహారిక కేవలం నిర్మాతగా పలు వెబ్ సిరీస్ లు, సినిమాలు తీశారు. విడాకుల తరువాత మాలి తెరపై కనిపించడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల డెడ్ పిక్సెల్ అనే వెబ్ సిరీస్లో కనిపించారు నిహారిక.