డిచ్‌పల్లి రోడ్డును కొన్న ఎన్‌ఐఐఎఫ్‌

డిచ్‌పల్లి రోడ్డును కొన్న ఎన్‌ఐఐఎఫ్‌
  •     రోడ్డు సెక్టార్‌‌‌‌లో సంస్థకు ఇదే  మొదటి ఇన్వెస్ట్‌‌మెంట్‌‌

న్యూఢిల్లీ: నేషనల్‌‌ ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ అండ్‌‌ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ ఫండ్‌‌(ఎన్‌‌ఐఐఎఫ్‌‌) మొదటి సారిగా ఇండియన్ రోడ్స్‌‌ ట్రాన్స్‌‌పోర్ట్‌‌ సెక్టార్లోకి అడుగుపెట్టింది. ఎస్సెల్‌‌ గ్రూప్‌‌కు చెందిన రెండు టోల్‌‌వేస్‌‌(టోల్‌‌ రోడ్లు)ను ఎన్‌‌ఐఐఎఫ్‌‌ మాస్టర్‌‌‌‌ ఫండ్‌‌ ద్వారా కొనుగోలు చేశామని ఈ సంస్థ పేర్కొంది. తెలంగాణలోని డిచ్‌‌పల్లి టోల్‌‌వే, కర్నాటకలోని దేవనహళ్లి టోల్‌‌వేలను ఎస్సెల్‌‌ గ్రూప్ నుంచి ఎన్‌‌ఐఐఎఫ్‌‌ కొనుగోలు చేసింది. ఎన్‌‌ఐఐఎఫ్‌‌కు చెందిన అతాంగ్‌‌ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ ఈ టోల్‌‌వేస్‌‌ను మేనేజ్‌‌ చేస్తుంది. తెలంగాణలోని డిచ్‌‌పల్లి టోల్‌‌వే 60 కి.మీ పొడవుండగా, నాలుగులేన్లలో విస్తరించి ఉంది. ఈ రోడ్డు హైదరాబాద్–నాగపూర్‌‌‌‌ వంటి కీలకమైన ఇండస్ట్రీయల్‌‌ హబ్‌‌లను కలుపుతోంది. డిచ్‌పల్లి రోడ్డు అందుబాటులోకి వచ్చి ఏడేళ్లు పూర్తయ్యిందని ఎన్‌‌ఐఐఎఫ్‌‌ తెలిపింది. కర్నాటకలోని  దేవనహళ్లి టోల్‌‌వే 22 కి.మీ విస్తరించి ఉంది.   బెంగళూరు ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌, సిటీలను ఈ రోడ్డు కలుపుతోంది. ఈ రోడ్డు ఎన్‌‌హెచ్‌‌ 44 లో భాగంగా ఉందని, అందుబాటులోకి వచ్చి ఆరేళ్లకు పైనే అవుతుందని ఎన్‌‌ఐఐఎఫ్‌‌ పేర్కొంది.

పోర్ట్స్‌‌, ఎనర్జీ స్మార్ట్‌‌ మీటర్లలో కూడా..

రోడ్డు సెక్టార్‌‌‌‌లో మాత్రమే కాకుండా పోర్ట్స్‌‌ అండ్‌‌ లాజిస్టిక్స్‌‌, రెన్యువబుల్స్‌‌, ఎనర్జీ స్మార్ట్‌‌ మీటర్స్‌‌ వంటి సెక్టార్లలో కూడా ఎన్‌‌ఐఐఎఫ్‌‌ మాస్టర్‌‌‌‌ ఫండ్‌‌కు ప్లాట్‌‌ఫామ్స్ ఉన్నాయి. హిందుస్తాన్‌‌ ఇన్‌‌ఫ్రాలాగ్‌‌ ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌ పేరుతో పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్‌‌ ప్లాట్‌‌ఫామ్‌‌ను మేనేజ్‌‌చేస్తున్నామని ఎన్‌‌ఐఐఎఫ్‌‌ పేర్కొంది. దేశంలోని కంటైనర్‌‌‌‌ లాజిస్టిక్స్‌‌, డొమెస్టిక్ సప్లయ్‌‌ చెయిన్‌‌లో కీలకంగా ఈ ప్లాట్‌‌ఫామ్‌‌ ఉందని తెలిపింది. ప్రస్తుతం ఎన్‌‌ఐఐఎఫ్‌‌కు చెందిన అయాన రెన్యువబుల్స్‌‌ 1.1 గిగావాట్ల గ్రీన్‌‌ఫీల్డ్‌‌ కెపాసిటీని డెవలప్ చేస్తోంది. దీంతోపాటు ఇతర ప్రాజెక్ట్‌‌లను కొనుగోలు కూడా చేస్తోంది. ఎన్‌‌ఐఐఎఫ్‌‌కు చెందిన ఇంటెలిస్మార్ట్‌‌  స్మార్ట్‌‌మీటర్‌‌‌‌ సెగ్మెంట్‌‌లో మార్కెట్‌‌ లీడర్‌‌‌‌గా ఉంది.  ప్రభుత్వం టార్గెట్‌‌గా పెట్టుకున్న 25 కోట్ల స్మార్ట్‌‌ మీటర్ల ఇన్‌‌స్టాల్‌‌మెంట్‌‌ టార్గెట్‌‌ను చేరుకునేందుకు పనిచేస్తున్నామని ఎన్‌‌ఐఐఎఫ్‌‌ తెలిపింది. రోడ్‌‌ సెక్టార్‌‌‌‌లో మొదటి ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ను జరిపినందుకు ఆనందంగా ఉందని ఎన్‌‌ఐఐఎఫ్‌‌ పేర్కొంది. ఇండియన్ రోడ్డు సెక్టార్‌‌‌‌లో కీలకంగా మారడమే అతాంగ్‌‌ టార్గెట్‌‌ అని ఎన్‌‌ఐఐఎఫ్‌‌ మేనేజింగ్‌‌ పార్టనర్‌‌‌‌ వినోద్‌‌ గిరి అన్నారు. ఇంటర్నేషనల్‌‌, ఇండియన్ ఇన్వెస్టర్ల  కోసం తీసుకొచ్చిన ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ ప్లాట్‌‌ఫామే ఎన్‌‌ఐఐఎఫ్​. దీనికి ప్రభుత్వం సపోర్ట్ ఉంది.