పదేండ్ల చిన్నారిపై 9 మంది గ్యాంగ్‌‌‌‌‌‌‌‌ రేప్‌‌‌‌‌‌‌‌

పదేండ్ల చిన్నారిపై 9 మంది గ్యాంగ్‌‌‌‌‌‌‌‌ రేప్‌‌‌‌‌‌‌‌
  • నిందితుల్లో ఐదుగురు దగ్గరి బంధువులే
  • 10-12 ఏండ్ల వాళ్లు ఐదుగురు, ఒకరికి 18 ఏండ్లు
  • వీడియో తీసి వాట్సాప్‌‌‌‌‌‌‌‌లో షేర్‌‌‌‌‌‌‌‌ చేసిన మైనర్లు
  • 2 వారాల తర్వాత బాలిక తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్‌‌‌‌‌‌‌‌

చండీఘర్‌‌‌‌‌‌‌‌: ఐదో తరగతి చదువుతున్న ఓ పదేళ్ల బాలికను ఓ 18 ఏండ్ల యువకుడు, 8 మంది మైనర్లు కలిసి రేప్‌‌‌‌‌‌‌‌ చేశారు. వీడియో తీసి ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో అప్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ చేశారు. అది వాట్సాప్‌‌‌‌‌‌‌‌లో వైరలైన 2 వారాల తర్వాత బాలిక తల్లిదండ్రులకు విషయం తెలిసింది. దీంతో వాళ్లు పోలీసులకు కంప్లైంట్‌‌‌‌‌‌‌‌ చేశారు. హర్యానా రాష్ట్రం రేవారి జిల్లాలోని ఓ గ్రామంలో మే 24న ఈ సంఘటన జరిగింది. ఆ రోజు ఇంటి బయట ఆడుకుంటున్న ఆ బాలికను మైనర్లు కిడ్నాప్‌‌‌‌‌‌‌‌ చేశారు. తర్వాత ఊర్లో ఖాళీగాఉన్న స్కూల్‌‌‌‌‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌లోకి తీసుకెళ్లి రేప్‌‌‌‌‌‌‌‌ చేశారు. వాళ్లలోని 18 ఏండ్ల యువకుడు వీడియో తీయగా ఇద్దరు మైనర్లు దాన్ని కొంతమందికి పంపారు. జూన్‌‌‌‌‌‌‌‌ 8న బాలిక పక్కింటి వ్యక్తికి వీడియో ఫార్వర్డ్‌‌‌‌‌‌‌‌ కావడంతో ఆయన వచ్చి బాలిక తండ్రికి చెప్పగా ఆయన జూన్‌‌‌‌‌‌‌‌ 9న పోలీసులకు కంప్లైంట్‌‌‌‌‌‌‌‌ చేశారు. మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికను రేప్‌‌‌‌‌‌‌‌ చేసిన మైనర్లలో 10 నుంచి 12 ఏండ్ల వయసు వాళ్లు ఐదుగురు ఉన్నారు. ఆ 9 మందిలో ఐదుగురు బాలిక బంధువులు.

అలాంటి వీడియోలు షేర్‌‌‌‌‌‌‌‌ చేస్తే నేరం
కేసు ఫైల్‌‌‌‌‌‌‌‌ చేయగానే నిందితులను పట్టుకున్నామని రేవారి డీఎస్పీ హన్స్‌‌‌‌‌‌‌‌రాజ్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. ఇప్పటివరకు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని, వాళ్లలో 18 ఏండ్ల వ్యక్తి ఉన్నాడని తెలిపారు. మైనర్లను జువెనైల్‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌ బోర్డు ముందు హాజరుపరిచి కరెక్షన్‌‌‌‌‌‌‌‌ హోమ్‌‌‌‌‌‌‌‌కు తరలించామని చెప్పారు. యువకుడిని కోర్టులో హాజరు పరిచామని, తర్వాత జిల్లా జైలుకు తరలించామని తెలిపారు. వీడియోలో ఉన్న మిగిలిన మైనర్లను, వీడియోను షేర్‌‌‌‌‌‌‌‌ చేసిన వారిని వెతుకుతున్నామని చెప్పారు. బాలిక ఫ్యామిలీ, ఆమెను రేప్‌‌‌‌‌‌‌‌ చేసిన మైనర్ల ఫ్యామిలీలు పక్కపక్కనే ఉంటున్నాయన్నారు. బాలికను రేప్‌‌‌‌‌‌‌‌ చేశాక మైనర్లందరూ నార్మల్‌‌‌‌‌‌‌‌గానే తమ రోజు వారి పనులు చేశారని, వీడియో షేర్‌‌‌‌‌‌‌‌ చేశారని తెలిపారు. ఆ సంఘటన గురించి బాలిక తన తల్లిదండ్రులకు చెప్పలేకపోయిందన్నారు. ప్రస్తుతం క్లాసులు నడవట్లేదని, అందుకే స్కూలు ఖాళీగా ఉందని చెప్పారు.