V6 News

ఎస్ఆర్ విద్యార్థుల విజయభేరి

ఎస్ఆర్ విద్యార్థుల విజయభేరి

గ్రేటర్​ వరంగల్, వెలుగు: పదో తరగతి ఫలితాల్లో ఎస్ఆర్ విద్యాసంస్థల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి విజయభేరి మోగించారు. బుధవారం విడుదలైన ఫలితాల్లో ఈ సంస్థకు చెందిన విద్యార్థులు స్టేట్ లెవల్ మార్కులు సాధించి రికార్డు సృష్టించారని విద్యాసంస్థల అధినేత వరదారెడ్డి తెలిపారు. బుధవారం విడుదలైన ఫలితాల్లో సి. సంస్కృతరెడ్డి 600మార్కులకు గాను 589,  పి. వంశీ 588, ఎస్.​ కీర్తన 587, ఎ. సౌజన్య 587, ఎ. సంజయ్​586, టి. వైష్ణవి 585, బి సాయిశ్రీ 584 మార్కులు సాధించి విజయకేతనం ఎగురవేశారని చెప్పారు.

మరో 22 మంది స్టూడెంట్లు 580 మార్కులు సాధించారని పేర్కొన్నారు. పక్కా ప్రణాళిక, అనుభవజ్ఞలైన ఉపాధ్యాయుల బోధనతోనే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని వెల్లడించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన స్టూడెంట్లను విద్యాసంస్థల అధినేత వరదారెడ్డి, డైరెక్టర్లు మధూకర్ రెడ్డి, సంతోష్ రెడ్డి అభినందించారు.